Site icon NTV Telugu

TTD : శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. నేడు టీటీడీ ప్రత్యేక దర్శనం టికెట్లు

Ttd

Ttd

ఏడుకొండల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. నేడు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేయనున్నటలు టీటీడీ అధికారులు వెల్లడించారు. డిసెంబర్‌ నెలకు సంబంధించిన టిక్కెట్లను అధికారిక వెబ్ సైట్ లో నేడు ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్‌ఈడీ) కల్పించే రూ.300 టికెట్లను వివిధ స్లాట్లలో అందించనున్నట్లు తెలిపారు. కాగా.. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని రకాల దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. కేవలం సర్వదర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Also Read : Blast in Crackers Factory: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు తునాతునకలైన మృతదేహాలు.. సీఎం దిగ్భ్రాంతి

ఈ క్రమంలో భక్తులు ఆయా తేదీలను చూసుకొని, టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు టీటీడీ అధికారులు. మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. అలాగే.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని అధికారు తెలిపారు. నిన్న శ్రీవారిని 61,304 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,133 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.46 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Exit mobile version