Site icon NTV Telugu

TTD Online Tickets : శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. రేపు అక్టోబర్ నెల దర్శన టికెట్లు విడుదల

Ttd

Ttd

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. రేపు ఆన్ లైన్ లో అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. రేపు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్టుల విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు విడుదల చేయనున్నారు. మధ్యహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. ఎల్లుండి 300 రుపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు టీటీడీ విడుదల చేయనుంది. అలాగే.. ఆగస్టు, సెప్టెంబర్ నెలకు సంబంధించి రోజుకి 4 వేల చొప్పున అదనపు కోటా టికెట్లు విడుదల చేయనున్నారు. అక్టోబర్ నెలకు సంబంధించి రోజుకి 15 వేల చొప్పున టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.

Also Read : Twitter: ట్విట్టర్ ఏది ఉచితంగా ఇవ్వదు.. అంటునే మస్క్ మళ్లీ ఫిట్టింగ్..!

తిరుమల, తిరుపతి, తలకోనలో అక్టోబరు నెల గదుల కోటాను జూలై 26న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది. అలాగే.. శ్రీవాణి ట్రస్టు దాతల కోసం… శ్రీవాణి ట్రస్టు దాతలకు దర్శనం, గదులకు సంబంధించి అక్టోబరు కోటాను జూలై 24న ఉదయం 11 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

Also Read : Professional Girlfriend: గర్ల్ ఫ్రెండ్ లేదని ఫీలవుతున్నారా.. రోజుకో లక్ష పెడితే దొరికేస్తుంది

Exit mobile version