NTV Telugu Site icon

Kondagattu Anjanna: టీటీడీ శుభవార్త.. నెరవేరనున్న కొండగట్టు అంజన్న భక్తుల కల..

Kondagattu

Kondagattu

టీటీడీ శుభవార్త చెప్పింది. కొండగట్టు అంజన్న భక్తుల కల త్వరలో నెరవేరనుంది. భక్తుల కోరిక మేరకు 100 గదుల నిర్మాణానికి టీటీడీ ముందుకు వచ్చింది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్థల పరిశీలన చేపట్టారు. టీటీడీ నుంచి వచ్చిన ఇంజనీరింగ్ అధికారులతోపాటు ఈవోతో కలసి స్థలాన్ని పరిశీలించారు.

READ MORE: Zomato: భార్యతో కలిసి ఫుడ్ డెలివరీ చేసిన జొమాటో సీఈవో గోయల్

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ.. కొండగట్టు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టు బడి ఉందని తెలిపారు. గత ప్రభుత్వం 100కోట్లు ఇస్తామని చెప్పి అంజన్న భక్తులను మోసం చేసిందని ఆరోపించారు. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల సహకారంతో కొండగట్టును అభివృద్ధి చేసుకుంటామన్నారు. త్వరలోనే 100 గదుల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. కొండగట్టు గిరి ప్రదక్షిణ రూట్ మ్యాప్ కూడా ఖరారు చేయనున్నట్లు చెప్పారు.
టీటీడీ నుంచి డీఈ పీవీ నాగరాజు, ఏఈ జే నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

READ MORE:Disadvantages of Earbuds : అలర్ట్.. ఇయర్‌బడ్స్‌ ఎక్కువగా వాడుతున్నారా?

ఇదిలా ఉండగా.. కొండగట్టు మీద ఉన్న ఆజనేయుని ఆలయం నిర్మణం 400 ఏళ్లకు క్రితం జరిగిందని దేవాలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ఆంజనేయుడు స్వయం భూ గా వెలిశాడని.. 400 ఏళ్ల క్రితం కొడిమ్యాల పరిగణాల్లో సింగం సంజీవుడు అనే యాదవుడికి అంజనేయ స్వామి కనిపించినట్లు కథనం.. ఏటా చాలా మంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు.