NTV Telugu Site icon

TTD EO Syamala Rao: లోపాలు గుర్తించాం.. లడ్డూ ప్రసాదం నాణ్యతపై దృష్టి పెట్టాం..

Ttd

Ttd

TTD EO Syamala Rao: లడ్డూ ప్రసాదం నాణ్యత పెంపుపై దృష్టి సారించామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు… లడ్డూ ప్రసాదం నాణ్యత పెంచాలంటే నాణ్యమైన నెయ్యి సరఫరా చేస్తే సాధ్యపడుతుందని పోటు కార్మికులు కోరడంతో ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించామన్నారు ఈవో.. అయితే, నెయ్యిని నాలుగు విధానాలలో టీటీడీ కోనుగోలు చేస్తూందని వెల్లడించారు.. మొదటిది నేషనల్ డైరీల ద్వారా కోనుగోలు చేస్తూంటే.. రెండోది ఏపీ డైరీల ద్వారా.. మూడోవది 1500 కిలోమీటర్లు పరిధిలో ఉండే డైరీలు ద్వారా కొనుగోలు.. నాలుగోది టిన్ ల ద్వారా కోనుగోలు చేస్తూన్నామని పేర్కొన్నారు.. అయితే, నెయ్యి నాణ్యత పరిశీలనకు ఎన్ఏబిఎల్ ల్యాబ్ కి పంపగా.. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదని నివేదికలో పేర్కొన్నారని వెల్లడించారు.. దీంతో, రెండు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపి.. కాంట్రాక్టర్ కి షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు..

Read Also: NEET: నీట్ రీ-ఎగ్జామ్ ఉండదు.. పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

మరోవైపు.. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూన్న ల్యాబ్ ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు ఈవో శ్యామలరావు.. అందుకోసం యంత్రాలను విదేశాలు నుంచి తెప్పించే ప్రయత్నం చేస్తూన్నామన్నారు. ప్రోక్యూర్మెంట్ విధానాలలో లోపాలు వున్నాయి.. వాటిని సరిదిద్దేందుకు నలుగురు నిపుణులతో కమిటీని వేశామని వెల్లడించారు టీటీడీ ఈవో శ్యామలరావు. తిరుమల శ్రీవారి లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యతలో నిబంధనల ప్రకారం ప్రమాణాలను పాటించిన ఓ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోనున్నట్లు టీడీడీ ఈవో శ్యామలరావు ప్రకటించిన విషయం విదితమే.. ఇటీవల టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యిలో నాణ్యత లోపాలను తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తించింది. ఏటా ముడిసరుకుల కొనుగోలు కోసం 500 కోట్లు వెచ్చిస్తుండగా.. అందులో నెయ్యి కొనుగోలుకే రూ.250 కోట్లు వెచ్చిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. నెయ్యి నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ క్యాలిబ్రేషన్ ల్యాబ్‌కు నెయ్యిని టీటీడీ పంపింది. టీటీడీకి సరఫరా చేస్తున్న 5 మంది పంపిణీదారులలో తమిళనాడుకి చెందిన పంపిణీదారుడు సరఫరా చేస్తున్న నెయ్యిలో నాణ్యత ప్రమాణాల లోపాలను టీటీడీ గుర్తించారు. ఈ క్రమంలోనే సరఫరాదారుడిని బ్లాక్ లిస్ట్‌లో చేర్చేందుకు టీటీడీ ఈవో షోకాజ్ నోటీస్ జారీ చేసిన విషయం విదితమే..

Show comments