NTV Telugu Site icon

Attempted Murder Case: హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మి, మరో ముగ్గురి అరెస్ట్

New Project (8)

New Project (8)

హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతోపాటు భర్త గిరీష్ చంద్రారెడ్డి, మరో ఇద్దరు అరెస్టు చేశారు అలిపిరి పోలీసులు. ఈనెల 25వ తేదీన తిరుపతి ఎన్జీవో కాలనీలో వెంకట శివారెడ్డి అనే వ్యక్తి పై హత్యాయత్నం జరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివారెడ్డి పోలీసులకు ఏ వివరాలు చెప్పలేకపోయారు. దీంతో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. శివారెడ్డి నివాసం ఉండే ఆపార్ట్ మెంట్ ముందే బైక్ తో శివారెడ్డిని అడ్డగించి ఇద్దరు వ్యక్తులు దాడి చేసినట్లుగా గుర్తించారు. మొద్దు కత్తితో తలపై నరకడంతో శివారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.

READ MORE: Side effects of smoking: ధూమపానంతో పురుషులు లైంగిక శక్తిని కోల్పోతారా?

అయితే హత్యాయత్నం చేసిందెవరో సీసీ కెమెరా దృశ్యాల్లో స్పష్టంగా లేకపోవడంతో పోలీసులు శివారెడ్డితో శత్రుత్వం ఉన్నది ఎవరితోనే ఆరా తీశారు. వారి దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. శివారెడ్డిపై హత్యాయత్నం చేసిన వారిలో ఓ మహిళ, ఓ పురుషుడు ఉన్నట్లుగా గుర్తించారు. ఆరా తీస్తే.. వారిద్దరూ శివారెడ్డి ఫ్లాట్ ఎదురుగా నివాసం ఉండే శ్రీలక్ష్మి, ఆమె భర్త గిరీష్ చంద్రారెడ్డి అని తేలింది. ఎదురెదురు ఫ్లాట్లలో నివాసం ఉండటంతో అనేక విషయాలపై ఇరు కుటుంబాల మధ్య తరచూ వివాదాలు వస్తున్నాయి. శివారెడ్డి, శ్రీలక్ష్మి ఈ విషయంలో అనేక సార్లు గొడవ పడ్డారు.రెండు కుటంబాల వారు సమస్యల విషయంలో వెనక్కి తగ్గకుండా ఈగో సమస్యలకు పోవడంతో అవి అంతంకకూ పెరిగుతూ పోయాయి. చివరికి హత్యాయత్నానికి దారి తీసింది.

Show comments