TTD Chairman: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆవరణలో శ్రీ బాలాజీ ఆంకాలజీ భవనానికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. సీఎం జగన్ ఆదేశాలతో రాష్ట్రంలో ప్రజలు క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం చేపట్టామన్నారు. 124 కోట్ల రూపాయలతో శ్రీ బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ఆంకాలజీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. ఈరోజు కీలకమైన బంకర్ బ్లాక్‌కు శంకుస్థాపన చేశామని.. రూ.200 కోట్ల రూపాయలతో అత్యధునిక యంత్రాలు , సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ లోపు పూర్తి చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రతలు, టెస్టులు, పింక్ బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి జిల్లాకు పింక్ బస్సులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లా నలుమూలలకు పింక్ బస్సులు పంపించి స్క్రీనింగ్ చేస్తున్నామని తెలిపారు. మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆస్పత్రి నిర్మాణం జరుగుతోందన్నారు. మొత్తం 400 బెడ్స్ కెపాసిటీతో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం జరుగుతోందని టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, టీటీడీ పాలకమండలి సభ్యుడు పొకల అశోక్ కుమార్ పాల్గొన్నారు.
Read Also: Avinash Reddy: నేడు విచారణకు అవినాష్‌రెడ్డి బెయిల్ పిటిషన్.. సర్వత్రా ఉత్కంఠ
ఇదిలా ఉండగా.. తిరుమల ఘాట్ రోడ్డులో బుధవారం ఎలక్ట్రికల్ బస్సు ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ఘాట్ రోడ్డులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. ఎలక్ట్రికల్ బస్సు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడామని ఆయన తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణ చేపట్టామని, భవిష్యత్‌లో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ఐరన్ క్రాస్ బార్స్ ఎత్తు పెంచుతామని, ఘాట్ రోడ్ పిట్ట గోడలు మరింత పటిష్టం చేస్తామన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.