NTV Telugu Site icon

TTD Key Decisions: టీటీడీ హైలెవల్‌ కమిటీ కీలక నిర్ణయాలు.. నడకదారిలో ఇకపై ఇవి కుదరదు..

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy

TTD Key Decisions: తిరుమల నడకదారిలో చిన్నారి మృతి తీవ్ర కలకలం రేపింది.. దీంతో, అలర్ట్‌ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయాలు తీసుకుంది.. దీని కోసం ఈ రోజు టీటీడీ హైలెవల్‌ కమిటీ సమావేశం జరిగింది.. ఈ మధ్య నడక దారిలో చిన్నారులపై చిరుత దాడులపై చర్చించారు.. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి.. 40 రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులపై చిరుతలు దాడులు చేసింది.. భవిష్యత్త్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతాం అన్నారు. దీని కోసం అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గంలో చిన్న పిల్లలను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు.. ఇక, పెద్దవారిని అలిపిరి నడకమార్గంలో రాత్రి 10 గంటల వరకు అనుమతించనున్నట్టు పేర్కొన్నారు. నడకమార్గంలో వెళ్లే ప్రతీ భక్తుడికి చేతికర్రను అందిస్తాం అని వెల్లడించారు టీటీడీ చైర్మన్‌.

Read Also: Fight For Parking:పార్కింగ్‌ కోసం గొడవ.. పోలీసులను కూడా కొట్టిన స్థానికులు

ఇక, తిరుమల ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతిస్తాం అని తెలిపారు కరుణాకర్‌రెడ్డి.. భక్తులకు భధ్రత కల్పించేందుకు ఫారెస్ట్‌ విభాగంలో అదనపు సిబ్బందిని నియమిస్తాం అన్నారు. భక్తులు వన్యప్రాణులకు ఆహారం అందించడంపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొన్నారు. నడకమార్గాలలో హోటల్స్ ద్వారా వచ్చే వ్యర్థాలను భయట పడేయకుండా నిషేధిస్తూన్నాం అని స్పష్టం చేశారు. నడకమార్గంలో 500 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తాం.. డ్రోన్ కెమెరాలను అవసరానికి తగ్గట్టుగా వినియోగిస్తాం.. నడకదారికి ఇరు వైపుల ఫోకస్ లైట్లు ఏర్పాటు చేస్తాం.. 24 గంటల పాటు అందుబాటులో వుండేలా ఫారెస్ట్‌ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మరోవైపు.. నడకదారిలో పెన్సింగ్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు..

Read Also: World Cup 2023: ఏంటి బాస్.. వచ్చిన అవకాశాలను వదిలేసుకుంటున్నారు..

అయితే, నడకదారి భక్తులకు దర్శన టికెట్ల జారి విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు కరుణాకర్‌రెడ్డి.. కానీ, టోకెన్లు గాలిగోపురం వద్ద తనిఖీ చేసే విధానాన్ని రద్దు చేస్తున్నాం అన్నారు. టోకెన్ పొందిన భక్తులు కాలినడకన వెళ్లకపోయినా దర్శనానికి అనుమతిస్తాం అని ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో 12 సంవత్సరాల లోపు చిన్నారులను మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడకదారిలో అనుమతించబోమని స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి.