Site icon NTV Telugu

TTD: 5258 కోట్ల అంచనాతో టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం..

Ttd

Ttd

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్యక్షతన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ. 5258 కోట్ల రూపాయల అంచనాతో టీటీడీ వార్షిక బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం తెలిపింది. హుండీ ద్వారా రూ. 1,729 కోట్లు ఆదాయం లభిస్తూందని పాలక మండలి అంచనా వేసింది. వడ్డీల ద్వారా రూ. 1,310 కోట్లు ఆదాయం లభిస్తూందని అంచనా వేశారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ. 600 కోట్లు, దర్శన టిక్కెట్ల విక్రయం ద్వారా రూ. 310 కోట్ల ఆదాయం వస్తుందని వెల్లడించింది.

Also Read:Bandi Sanjay : ఎంఎంటీఎస్ ఘటన బాధితురాలికి బండి సంజయ్ ఫోన్.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా

జీతాల చెల్లింపుకు రూ. 1,774 కోట్లు కేటాయింపు, ముడిసరుకుల కోనుగోలుకు రూ. 768 కోట్లు, ఫిక్స్ డ్ డిపాజిట్ కు 800 కోట్లు, ఇంజనీరింగ్ పనులుకు రూ. 500 కోట్లు కేటాయించారు. అదేవిధంగా రాష్ట్రాల రాజధానుల్లో ఆలయాలు నిర్మించాలని నిర్ణయించింది. ఇతరదేశాల్లోనూ శ్రీవారి ఆలయాలు నిర్మించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. త్వరలో వీఐపీ బ్రేక్‌ దర్శన వేళల్లో మార్పులు చేయాలని టీటీడీ నిర్ణయించింది.

Exit mobile version