Site icon NTV Telugu

TTD Alert: వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం.. తిరుమలలో భారీ బందోబస్తు..!

Tirumala

Tirumala

TTD Alert: వైకుంఠ ఏకాదశి–ద్వాదశి పర్వదినాల సందర్భంగా తిరుమలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. వైకుంఠ ఏకాదశి (30-12-2025), వైకుంఠ ద్వాదశి (08-01-2026) సందర్భంగా మొత్తం 10 రోజుల పాటు (డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు) వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుందని తెలిపారు.

Chennai: పెళ్లై 9 రోజులు కూడా కాకముందే భార్య హత్య, భర్త ఆత్మహత్య..!

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమలలో సుమారు 2000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1 తేదీల్లో టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనమని మరోమారు గుర్తు చేశారు. ఆన్‌లైన్ ద్వారా సుమారు 25 లక్షల మంది భక్తులు దరఖాస్తు చేయగా, ప్రతిరోజు 60,000 టోకెన్లు చొప్పున దర్శనాలు కేటాయింపు జరిగింది. భక్తుల రద్దీ నియంత్రణ కోసం ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, క్యూలైన్ నిర్వహణ, నిఘా చర్యలు ముందస్తుగా అమలు చేయనున్నారు.

Cigarette prices: రూ. 18 నుంచి రూ. 72కి పెరగనున్న సిగరెట్ ధరలు.?

ఇంకా టీటీడీ అధికారులతో సమన్వయం చేసుకుని విధులు నిర్వహణ చేస్తున్నారు అధికారులు. ఈ సందర్బంగా భక్తులకు పలు సూచనలు చేశారు. భక్తులు క్రమశిక్షణతో, సౌమ్యంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పిల్లలు, వృద్ధులు, విలువైన ఆభరణాల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Exit mobile version