TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్ చేసుకుంటే టిక్కెట్ రేట్లలో డిస్కౌంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. ముందుస్తు రిజర్వేషన్ చేసుకుంటే టిక్కెట్ రేట్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ తీసుకొచ్చింది. 31 రోజుల నుంచి 45 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకుంటే టికెట్‌లో 5 శాతం రాయితీ కల్పించింది. 46 రోజుల నుంచి 60 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ ప్రకటించింది. ఆ మేరకు ఆన్‌లైన్ ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టం(ఓపీఆర్ఎస్) సాప్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసింది. ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్ని సర్వీస్‌లకు ఈ రాయితీ వర్తిస్తుందని టీఎస్ఆర్టీసీ సంస్థ స్పష్టం చేసింది. సంక్రాంతి సందర్భంగా ముందస్తు రిజర్వేషన్‌ను 30 రోజుల నుంచి 60 రోజులకు టీఎస్ ఆర్టీసీ పెంచింది. ఈ ఏడాది జూన్ వరకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ సదుపాయానికి ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆన్ లైన్ లో సులువుగా తమ టికెట్లను రిజర్వేషన్ చేసుకున్నారు.
Read Also: RTC Bus: బెజవాడలో హోటల్‌లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
“రాబోయే రోజుల్లో శుభకార్యాలు, పెళ్లిళ్లు, పండుగలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీఎస్ఆర్టీసీ అందిస్తున్న ఆఫర్లను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి.. తద్వారా సంస్థను కాపాడాలి. సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లోనే సాధ్యం. ముందస్తు రిజర్వేషన్ విధానానికి మంచి స్పందన లభిస్తోంది. ప్రయాణీకులకు రవాణా సేవలను మరింత మెరుగుపరచడానికి తగిన కృషి చేస్తాము” అని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాలని వారు కోరారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!