NTV Telugu Site icon

TSRTC: మీట నొక్కగానే.. సమస్త సమాచారం.. కొత్త సాంకేతికతతో నెట్ వర్క్ అప్ గ్రేడ్

Sajjanar About Tsrtc

Sajjanar About Tsrtc

TSRTC: తెలంగాణ ఆర్టీసీకి దేశంలోనే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) చర్యలు చేపట్టిందని సంస్థ ఎండీ సజ్జనార్ అన్నారు. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొత్త సాంకేతికతతో నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒరాకిల్‌ ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌ అమలుకు నల్సాప్ట్‌ కంపెనీతో టీఎస్‌ఆర్టీసీ ఎంవోయూ కుదుర్చుకుంది. హైదరాబాద్ బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, నల్సాఫ్ట్ సీఈవో సీఏ వెంకట నల్లూరి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఇలా ఒప్పందం కుదుర్చుకోవటం దేశంలోనే అన్ని ఎస్‌ఆర్‌టీయూలో ఇదే మొద‌టిది.

Read Also: Raja Singh : ‘చావడానికైనా సిద్ధం.. ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడను’

అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవటంలో తెలంగాణ ఆర్టీసీ ముందంజలో ఉందని, సాంకేతికత ద్వారానే వేగంగా ప్రయాణికులకు చేరువ అవుతున్నామనే విషయాన్ని సజ్జనార్ గుర్తు చేశారు. ఆన్‌లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్(ఓపీఆర్‌ఎస్‌), బస్ పాసుల జారీ, లాజిస్టిక్, పార్శిల్ సేవలు, బస్సు ట్రాకింగ్‌, క్యూఆర్‌ కోడ్ ఆధారంగా యూపీఐ చెల్లింపులు, బుకింగ్‌ కౌంటర్ల ఆన్‌లైన్‌, ప్రజల సౌకర్యార్థం అద్దె బస్సుల బుకింగ్‌, ప్రయాణ టికెట్‌తో పాటు తిరుపతి దేవస్థానం శీఘ్ర దర్శన సదుపాయాన్ని ఆన్‌లైన్‌ ద్వారానే అందిస్తున్నామ‌ని చెప్పారు.

Read Also: Union Budget : నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. పార్లమెంట్లో ప్రసంగించనున్న రాష్ట్రపతి

బస్సుల లోకేషన్‌ను కచ్చితంగా తెలుసుకోవడానికి బస్ ట్రాకింగ్‌ యాప్‌ను, సంస్థ రెవెన్యూ నిర్వహణకు కమర్షియల్‌ యాప్‌ను, ఉద్యోగుల హాజరు, సెలవుల మంజూరు, ఫిర్యాదులను స్వీకరించడానికి ఉద్యోగుల యాప్‌లను ఇటీవలే ప్రారంభించామని సజ్జనార్ తెలిపారు. ప్రాజెక్టు అమలు భాగస్వామిగా నల్సాఫ్ట్‌ కంపెనీ ఉంటుందని స్పష్టం చేశారు. 20 ఏళ్లకుపైగా నల్సాప్ట్‌.. ఒరాకిల్‌ పార్ట్‌నర్‌గా ఉందని, అప్లికేషన్‌ సొల్యూషన్స్‌, వేగవంతమైన సేవలను అందించడంలో ఆ కంపెనీకి అనుభవముందన్నారు.

Read Also:Attack On Hindu Temple: హిందూ ఆలయంపై దుండగుల దాడి.. ఏడాదిలో ఇది మూడోసారి

10 వేల‌ బ‌స్సులు, 47, 528 వేల మంది ఉద్యోగులు, 99 డిపోలు, 364 బస్ స్టేషన్‌లతో అతిపెద్ద నెట్‌వ‌ర్క్‌ ఉన్న సంస్థ ప్రతి రోజూ 32 లక్షల కిలోమీటర్లు బ‌స్సుల‌ను న‌డుపుతూ సుమారు 45 లక్షల మంది ప్రయాణికుల గ‌మ్యస్థానాల‌కు చేర‌వేస్తుందన్నారు. కార్గో, పెట్రోలు బంకులు, జీవా బ్రాండుతో వాటర్ బాటిళ్లు, త‌దిత‌ర విభిన్న సేవ‌లతో టీఎస్ ఆర్టీసీ ప్రజలకు మరింత చేరువైందని చెప్పారు. 9,377 గ్రామాలకు ర‌వాణా సేవ‌లు అందిస్తున్న సంస్థలో కార్యక‌లాపాల నిర్వహ‌ణకై ERPని అమలు చేయటం సవాళ్లతో కూడుకన్న పని అని సజ్జనార్ అన్నారు. అందుకే ఒరాకిల్‌ ఈఆర్పీ ప్రాజెక్ట్‌ను అమలు చేయాలని భావించినట్లు చెప్పారు.

Show comments