TGSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం బహిరంగ లేఖ.. సమ్మె ఆలోచనను విరమించాలంటూ విజ్ఞప్తి
- అభివృద్ధి మార్గంలో ఉన్న సంస్థకు సమ్మె తీరని నష్టం
- ఉద్యోగుల సంక్షేమమే ప్రథమ లక్ష్యమని స్పష్టం చేసిన యాజమాన్యం
- ఎస్మా చట్టం ప్రకారం సమ్మెపై కఠిన చర్యల హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGSRTC : తల్లి లాంటి ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తించి, సమ్మె నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగులకు బహిరంగ లేఖ ద్వారా విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం సంస్థ అభివృద్ధి మార్గంలో పయనిస్తున్న సమయంలో సమ్మె అనేది తీరని నష్టానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. యాజమాన్యం వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంస్థ పూర్తిగా కట్టుబడి ఉంది. 2019లో జరిగిన సమ్మె సంస్థను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయగా, ఇప్పుడు ఉద్యోగుల సమిష్టి కృషితో ఆ కష్టాలను అధిగమించి ప్రజల్లో విశ్వాసం పొందుతోందని పేర్కొంది.
Land Allocation in Amaravati: అమరావతిలో ఏ సంస్థకు ఎంత భూమి..? తేల్చనున్న కేబినెట్ సబ్‌కమిటీ
Also Read
- India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
- Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
ఈ నేపథ్యంలో మరోసారి సమ్మెకు ప్రయత్నించడం సంస్థ భవిష్యత్‌తో పాటు ఉద్యోగుల భద్రతను కూడా ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని లేఖలో హితవు పలికింది. కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం సమ్మెలాంటి నిర్ణయాలను ప్రోత్సహించుతున్నారని, వారి మాటల ప్రభావంతో ఊగిపోవద్దని హెచ్చరించింది. ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగుల సంక్షేమాన్ని మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటోందని స్పష్టం చేసింది. సంస్థకు వచ్చే ప్రతి రూపాయిని ఉద్యోగుల రాయితీలు, వేతనాలు, భద్రత కోసం వినియోగిస్తున్నట్లు వివరించింది.
అదే సమయంలో, ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధితమై ఉన్నాయని, సంస్థ నిబంధనల ప్రకారంగా సమ్మెలు చట్టవ్యతిరేకమని స్పష్టం చేసింది. సమ్మె పేరుతో ఇతర ఉద్యోగులను బెదిరించడం, విధులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలు చట్టపరమైన ఫలితాలు తేవచ్చని హెచ్చరించింది.
తాజావార్తలు
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!