Site icon NTV Telugu

TSRTC : రేపటి నుంచి టీఎస్సీఆర్టీసీ లక్కీ డ్రా

Tsrtc Lucky Dra

Tsrtc Lucky Dra

బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో #TSRTC నిర్వహిస్తోన్న లక్కీ డ్రా బుధవారం నుంచి ప్రారంభమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 30 వరకు ఇది కొనసాగుతుంది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్ ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లలో ప్రయాణికులు వేయాలి. బస్టాండ్లు, ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లలో మహిళలు, పురుషులకు వేర్వేరుగా డ్రాప్ బాక్స్ లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

Also Read : Rahul Gandhi: రేపటి నుంచి తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన..షెడ్యూల్ ఇదే..!

ప్రతి రీజియన్ కేంద్రంలో లక్కీ డ్రా నిర్వహించి 10 మంది చొప్పున విజేతలను అధికారులు ఎంపిక చేస్తారు. ఈ ల‌క్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు రూ.11 లక్షల నగదు బ‌హుమ‌తులను సంస్థ అందించనుంది. ప్రతి రీజియన్ కు ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు.. మొత్తం 110 మందికి ఒక్కొకరికి రూ.9900 చొప్పున బహుమతులను ఇవ్వనుంది. బతుకమ్మ, దసరా పండుగలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు రాఖీ పౌర్ణమి మాదిరిగానే ఈ లక్కీ డ్రా సదుపాయాన్ని వినియోగించుకోవాలని మరియు సంస్థను ఆదరించాలని కోరుతోంది.

Also Read : Yogi Adityanath: వారికి దీపావళి కానుక.. ఒక గ్యాస్‌ సిలిండర్‌ ఫ్రీ..

Exit mobile version