Site icon NTV Telugu

TSRTC ZIVA Drinking Water: టీఎస్‌ఆర్టీసీ ‘జీవా’ వాటర్ బాటిళ్ల విక్రయం రేపే ప్రారంభం

ziva water

Collage Maker 08 Jan 2023 04.42 Pm (1)

వినూత్న పథకాలతో ప్రయాణికులకు దగ్గరైన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు స్వచ్ఛమయిన తాగునీటిని అందించేందుకు మార్కెట్‌లోకి ఆర్టీసీ బ్రాండ్‌ జీవా (ZIVA) వాటర్‌ బాటిళ్లు ప్రవేశపెట్టింది. ఈ పథకం జనవరి 9వ తేదీన ప్రారంభిస్తున్నట్టు ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రస్తుతం లీటర్ బాటిళ్ళు అందుబాటులో ఉంటాయని, త్వరలో 250 ఎంఎల్‌, అర లీటర్‌ బాటిళ్ల ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు.ఇప్పటికే పెట్రోల్‌ బంక్‌లు, లాజిస్టిక్స్‌ సేవలను విజయవంతంగా నిర్వహిస్తోండగా.. తాజాగా డిమాండ్‌ ఎక్కువగా ఉన్న డ్రింకింగ్‌ వాటర్‌ వ్యాపారంలోకి ప్రవేశించాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. సొంత బ్రాండ్‌ పేరుతో ప్యాకెజ్‌డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ బాటిళ్లను విక్రయించాలని భావిస్తోంది.

Read Also: Shruti Haasan: వాల్తేరు వీరయ్య టీమ్ కు చివరి నిమిషంలో షాకిచ్చిన శృతి..

దశల వారీగా తెలంగాణ వ్యాప్తంగా విక్రయాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఈ జీవా వాటర్‌ బాటిళ్లు ‘స్పింగ్‌ ఆఫ్‌ లైఫ్‌’ అనే ట్యాగ్‌లైన్‌తో మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. స్వచ్ఛమయిన తాగునీటిని ప్రయాణికులకు అందిస్తామని, అన్ని ఆర్టీసీ బస్టాండ్లలో జీవా వాటర్ బాటిళ్లు విక్రయిస్తామన్నారు. తాగునీటి పేరుతో కల్తీ బ్రాండ్లు మార్కెట్లోకి వస్తున్నాయని, ప్రయాణికుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా జీవా వాటర్ బాటిల్స్ అందిస్తున్నామన్నారు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జీవా వాటర్ బాటిళ్ళలోని నీటిని తాగి తమ స్పందన (Feed Back) తెలపాలన్నారు.

గతంలో గర్భిణులు, బాలింతల కోసం పల్లె వెలుగు బస్సుల్లో 4, 6 నంబర్‌ సీట్లు, ఎక్స్‌ప్రెస్‌లో 1, 2 సీట్లను అందుబాటులో ఉంచింది. బాలింతలు తమ పిల్లలకు పాలివ్వడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే బస్టాండ్లలో బాలింతల కోసం ఆర్టీసీ ప్రత్యేకత్యేక గదులు ప్రారంభించింది. వీటికి ప్రత్యేక ఆదరణ లభిస్తోంది. చుట్టూ ప్రయాణికులు ఉంటే పిల్లలకు పాలివ్వడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీంతో వారి సౌకర్యం కోసం బస్టాండ్లలో ప్రత్యేక గది ఏర్పాటుచేశారు.

Read Also: Akhilesh Yadav: ఈ “టీ”లో విషం కలిపితే ఎలా..? పోలీసులు ఇచ్చిన ఛాయ్‌ని నిరాకరించిన అఖిలేష్ యాదవ్

Exit mobile version