TSRTC : ఆ వార్తల్లో నిజం లేదు.. డ్రైవర్ ఆత్మహత్యపై ఆర్టీసీ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్లగొండ జిల్లా దేవరకొండ డిపోనకు చెందిన డ్రైవర్ శంకర్ కు సెలవు మంజూరు చేయకుండా ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని వస్తోన్న వార్తల్లో నిజం లేదు. ఆ డ్రైవర్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ నెల 18, 19 తేదీల్లో విధులకు గైర్హాజరు అయ్యారు. అయినా ఈ నెల 20న డ్యూటీని అధికారులు కేటాయించడం జరిగింది. మళ్ళీ ఆదివారం సెలవు కావాలని డిపో అధికారులను సంప్రదించడం జరిగింది. వాళ్ళు లీవ్ పొజిషన్ చూసి సెలవు మంజూరు చేస్తామని చెప్పారు. సెలవు ఇవ్వబోమని చెప్పలేదు.
తనకు సెలవు మంజూరు చేయకుండా అధికారులు వేధిస్తున్నారని, పురుగుల మందు తాగుతున్ననంటూ ఒక సెల్ఫీ వీడియో వాట్సాప్ గ్రూప్ ల్లో శనివారం శంకర్ షేర్ చేయడం జరిగింది. వెంటనే డిపో అధికారులు అక్కడికి వెళ్లి ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ ఎలాంటి పురుగుల మందు తాగలేదని వైద్యులు ధ్రువీకరించి.. డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం డ్రైవర్ శంకర్ తన ఇంటి వద్ద సురక్షితంగా ఉన్నారు.
Also Read
డ్రైవర్ శంకర్ ఉద్దేశ్యపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడ్డారు. గతంలోనూ సెలవుల విషయంలో అధికారులపై బెదిరింపులకు దిగారు. ఆయన లీవ్ రికార్డు సరిగా లేదు. గత మూడు నెలల్లో 10 సాధారణ లీవ్ లు, 20 సిక్ లీవ్ లను డ్రైవర్ శంకర్ తీసుకున్నారు.
సిబ్బందికి సెలవుల మంజూరు విషయంలో నిబంధనల ప్రకారమే సంస్ట నడుచుకుంటోంది. లీవ్ పొజిషన్, కారణం తీవ్రతను బట్టి సెలవులను మంజూరు చేస్తోంది. ఎంప్లాయ్ యాప్ ద్వారా నేరుగా అధికారులను కలవకుండానే పారదర్శకంగా సెలవులను సిబ్బందికి మంజూరు చేయడం జరుగుతోంది. ఉద్దేశ్యపూర్వకంగా, సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ ఏమాత్రం ఉపేక్షించదు. ఇలాంటి ఘటనలపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని టీఎస్‌ఆర్టీసీ తెలిపారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!