తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి ఇంటర్ ఫప్ట్ ఇయర్ ప్రవేశాల కోసం టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష-2023 మే 6న నిర్వహిస్తున్నట్లు గురుకుల సొసైటీ సెక్రటరీ రమణకుమార్ వెల్లడించారు. మే 6వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిముషాల వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ లో దరఖాస్తు చేసుకున్నారు.
Also Read : Brij Bhushan Sharan Singh: నన్ను ఉరితీయండి కానీ కుస్తీని ఆపొద్దు.. బ్రిజ్ భూషణ్ కీలక వ్యాఖ్యలు
ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని 35 జూనియర్ కాలేజీల్లో ఇంటర్ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అయితే.. తెలంగాణ గురుకుల విద్యాలయముల సంస్థ 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ కోసం టెస్ట్ నిర్వహిస్తోంది. హైదరాబాద్, మహాబూబ్ నగర్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వచ్చే శనివారం ఉదయం. 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్ష కోసం 59,340 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. ఈ రోజు నుండి హల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.
Also Read : NTR 30: ఈ నెలంతా సోషల్ మీడియా హోరెత్తిపోవడం ఖాయం
