NTV Telugu Site icon

Ts Weather: అమ్మో తెలంగాణకు మరో రెండు రోజుల పాటు వర్ష సూచన

Rains

Rains

వాయువ్య బంగాళాఖాతంలో మరో 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని.. దాంతో వర్షాలు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిన్న ( బుధవారం ) ఈశాన్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న తూర్పు, మధ్య బంగాళాఖాతం మీదుగా ఆవర్తనం.. నేడు (గురువారం) వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 4.5 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

Read Also: Khushi: ఎదకు ఒక గాయం.. బ్రేకప్ లవర్స్ లిస్ట్ లో ఇంకో సాంగ్

ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో ప్రభావంతో రాగల మూడురోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు అధికారులు తెలిపారు. శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు ఆదిలాబాద్‌, కోమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, కామారెడ్డి, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Read Also: Mumbai: ఓ తల్లి నీకంత తొందరేమీ వచ్చింది. జారావో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి

అయితే, ఈ సీజన్‌లో ఆలస్యంగా వచ్చిన రుతుపవనాలు, జూలై నెల చివరిలో రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి. మళ్లీ ఆగస్టు నెలలో చినుకు కూడా పడకుండా పోయింది. ఆరుతడి పంటలు వేసిన రైతులు వర్షాల కోసం ధీనంగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు.