TS PGECET 2024: పీజీఈసెట్ 2024 నోటిఫికేషన్ విడుదల..అప్పటినుంచే దరఖాస్తుల స్వీకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు వరుస గుడ్ న్యూసులను చెబుతుంది.. 2024-25 ఏడాదికి గానూ వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు స్టేట్ పీజీఈసెట్ 2024 నోటిఫికేషన్ తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షలను జేఎన్టీయూహెచ్ నిర్వహించనున్నారు.. పీజీఈసెట్ 2024లో వచ్చిన ర్యాంకు ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలు, అఫిలియేటెడ్ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీల్లో ఫుల్ టైం ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.. ఈ పరీక్షలకు అర్హులైన వారు మార్చి 16 నుంచి అప్లై చేసుకోవచ్చు.. ఈ పరీక్షల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పరీక్షల ద్వారా మొత్తం 19 విభాగాల్లో ప్రవేశాలు ఉంటాయి.. ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, బయో-టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ, మెటలర్జికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, నానో టెక్నాలజీ, జియో-ఇంజినీరింగ్ అండ్ జియో-ఇన్ఫర్మాటిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫార్మసీ, టెక్స్టైల్ టెక్నాలజీలో ప్రవేశాలు ఉన్నాయని నోటిఫికేషన్ లో తెలిపారు..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
అర్హతలు..
ఈ పరీక్షలకు అర్హతలు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 10, 2024వ తేదీ వరకు ఎలాంటి ఆలస్యం రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు..
అప్లికేషన్ ఫీజు..
జనరల్ అభ్యర్ధులు రూ.1100 , ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులు రూ.600 తప్పనిసరిగా చెల్లించాలి. హైదరాబాద్, వరంగల్‌లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు..
ఇకపోతే రూ.250 నుంచి రూ.5 వేల ఆలస్య రుసుముతో
దరఖాస్తులకు చివరి తేదీ: మే 14 నుంచి 25 వరకు, 2024… హాల్‌టికెట్ల డౌన్లోడ్ ప్రారంభ తేదీ: మే 28
19 సబ్జెక్టులకు ప్రవేశ పరీక్షలు: జూన్ 6 నుంచి జూన్ 9 వరకు, 2024 పరీక్షలను నిర్వహించనున్నారు.. ఈ పరీక్షల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే అధికార వెబ్ సైట్లో తెలుసుకోవచ్చు..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!