NTV Telugu Site icon

TS PECET 2023 : తెలంగాణ పీఈసెట్‌ నోటిఫికేషన్‌

Ts Pecet

Ts Pecet

తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలలు అందించే రెండు సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (B.PEd), రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (D.PEd) కోర్సులలో ప్రవేశానికి 2023-24 విద్యా సంవత్సరానికి నిర్వహించే తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – 2023 (TS PECET-2023) తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరపున శాతవాహన విశ్వవిద్యాలయం షెడ్యూల్‌ను విడుదల చేసింది.

Also Read : IND VS AUS: తొలి రోజు ఆసీస్ దూకుడు.. సెంచరీతో చెలరేగిన ఖవాజా

ఈ మేరకు TS PECET-2023 షెడ్యూల్‌ను నేడు TSCHE చైర్మన్ ప్రొఫెసర్ ఆర్‌.లింబాద్రి విడుదల చేశారు. ప్రొఫెసర్ V. వెంకట రమణ, వైస్ చైర్మన్, TSCHE, ప్రొఫెసర్ S. మల్లేష్, చైర్మన్, TS PECET- 2023 & వైస్-ఛాన్సలర్, శాతవాహన విశ్వవిద్యాలయం, Prof. Ch. గోపాల్ రెడ్డి, వైస్-ఛాన్సలర్, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, Prof. L.B. లక్ష్మీకాంత్ రాథోడ్, వైస్-ఛాన్సలర్, పాలమూరు విశ్వవిద్యాలయం, Dr.N.శ్రీనివాసరావు, కార్యదర్శి, TSCHE, Prof. రాజేష్ కుమార్. కన్వీనర్, TS PECET-2023 పాల్గొన్నారు.

Also Read : Half Day Schools : విద్యార్థులకు అలర్ట్‌.. తెలంగాణ ఒంటిపూట బడులు షెడ్యూల్‌ రిలీజ్‌

అర్హులైన అభ్య‌ర్థులు ఈ నెల 15 నుంచి మే 6వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీల‌కు రూ. 500, మిగ‌తా కేట‌గిరిల వారికి రూ. 900గా ఫీజు నిర్ణయించారు. ఆల‌స్యం రుసుం రూ. 500తో మే 15 వ‌ర‌కు, రూ. 2000తో మే 20 వ‌ర‌కు, ఆల‌స్య రుసుం రూ. 5 వేల‌తో మే 25వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మే 26 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. జూన్ 1 నుంచి 10వ తేదీ వ‌ర‌కు ఫిజిక‌ల్ టెస్టులు నిర్వ‌హించ‌నున్నారు. జూన్ మూడో వారంలో ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. త‌దిత‌ర వివ‌రాల కోసం www.pecet.tsche.ac.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.