Site icon NTV Telugu

ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా ఇబ్బంది లేదు: మంత్రి జగదీష్

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదంపై ఇరురాష్ట్రాల మంత్రులు ఒకరిని ఒకరు విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఇరు రాష్ర్టాల మధ్య నీటి పంచాయితీకి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని కామెంట్స్ చేశారు. ఏపీ ప్రభుత్వం ఆకతాయి పిల్లాడిలా వ్యవహరించి , కేంద్ర బలగాలను కోరడం వారి చేతగాని తనంకు నిదర్శనం అన్నారు. ఏపీ ప్రభుత్వం ముందుగా జీవో 203 ను ఉపసహరించుకోవాలి. పొరుగు రాష్ట్రం స్నేహ హస్తం ఇచ్చినా దాన్ని ఉపయోగించుకోలేని, ఆంధ్ర ప్రభుత్వం అటు కేంద్రానికి ఇటు సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదం అన్నారు. తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులు అన్ని సక్రమమే.. ఆంధ్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా ఇబ్బంది లేదు.. నీటి వాటా తేల్చాలని మేం కూడా సుప్రీం కోర్టును అడుగుతున్నామన్నారు. ఆంధ్ర ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి జగదీష్ తెలిపారు.

Exit mobile version