Site icon NTV Telugu

Inter Supplementary : మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు.. హాల్ టికెట్లు ఎప్పుడంటే..?

Inter Exams

Inter Exams

Inter Supplementary : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 4,12,724 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో ఫస్ట్ ఇయర్ జనరల్ కోర్సులో 2,49,032 మంది, ఒకేషనల్ కోర్సులో 16,994 మంది ఉన్నారు. రెండవ సంవత్సరం జనరల్ కోర్సుకు 1,34,341 మంది, ఒకేషనల్ పరీక్షలకు 12,357 మంది విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు. గత నెల (ఏప్రిల్ 22) విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫస్ట్ ఇయర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్య 1.91 లక్షల మందే అయినా, మెరుగైన ఫలితాల కోసం ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాయడానికి కూడా అనేక మంది దరఖాస్తు చేయడంతో మొత్తం సంఖ్య గణనీయంగా పెరిగింది.

Ramya Moksha: ఓంకార్ తమ్ముడి సినిమాలో అలేఖ్య చిట్టి పికిల్స్ చెల్లి రమ్య మోక్ష..!

ఈ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి మే 29 వరకు జరగనున్నాయి. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు సబ్జెక్టుల వారీగా పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇంకా, సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు రెండు మూడు రోజుల్లో బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి. పరీక్షల అనంతరం 10 నుంచి 15 రోజుల్లో ఫలితాలను ప్రకటించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.

Bengaluru: బెంగళూరులో పాకిస్థాన్ అనుకూల నినాదాలు.. టెక్కీ అరెస్ట్

Exit mobile version