Inter Exam Fee: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు చెల్లింపు గడువు పెంపు..
- ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పెంపు..
- ఏప్రిల్ 23 వరకు అవకాశం..
తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఊరటనిస్తూ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు చెల్లింపు గడువును పెంచుతూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ప్రకటించిన వివరాల ప్రకారం.. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించే గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించారు. వాస్తవానికి ఈ గడువు అంతకుముందే ముగియాల్సి ఉన్నప్పటికీ.. విద్యార్థులు , తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు బోర్డు ఈ వెసులుబాటు కల్పించింది.
ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో మార్కులు తక్కువగా వచ్చి, ఇంప్రూవ్మెంట్ రాసుకోవాలనుకునే కూడా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అంతే కాకుండా.. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని కాపాడుకోవడానికి ఈ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు. జనరల్ మరియు వొకేషనల్ కోర్సుల విద్యార్థులందరికీ ఈ అవకాశం వర్తిస్తుంది.
Also Read:Jeevan Reddy : పార్టీకి ఎప్పుడూ కీడు చేయలేదు.. బయటకు అందుకే వచ్చా..!
ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగానే విద్యార్థులు ఉన్నత చదువులకు (డిగ్రీ, ఇంజనీరింగ్ మొదలైనవి) ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి, ఇది విద్యార్థులకు చాలా కీలకం. గడువు పొడిగింపు అనేది చివరి అవకాశం కావచ్చని.. కాబట్టి ఇంకా ఫీజు చెల్లించని విద్యార్థులు ఆలస్యం చేయకుండా వెంటనే తమ సంబంధిత కళాశాలల్లో సంప్రదించాలని బోర్డు స్పష్టం చేసింది. ఆన్లైన్ ద్వారా లేదా కళాశాల ప్రిన్సిపాళ్ల ద్వారా ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ల జారీ, పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను బోర్డు అధికారిక వెబ్సైట్లో ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
Inter Exam Fee: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు చెల్లింపు గడువు పెంపు..
-
Japan Tsunami Warning: దూసుకొస్తున్న సునామీ.. జపాన్‌లో 10 అడుగుల ఎత్తున ఎగిసిపడుతున్న కెరటాలు!
-
Hardik Pandya Captaincy: ఐపీఎల్ మధ్యలోనే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి గండం..! మాజీ క్రికెటర్ తీవ్ర విమర్శలు..
-
Anasuya Bharadwaj : అసభ్య పోస్టులతో అనసూయకు వేధింపులు: యువకుడి అరెస్ట్ !
-
Tamanna Simhadri: తల్లి కాబోతున్న ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి: అసలు కుదురుతుందా?
ట్రెండింగ్
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!
-
స్మార్ట్ ఫోన్స్ ప్రియులకు పండుగే.. Huawei నుంచి Motorola వరకు ఈ వారంలో విడుదలకబోతున్న మొబైల్స్ ఇవే.!