NTV Telugu Site icon

Strong Room : స్ట్రాంగ్ రూమ్ కీ మిస్సింగ్ పై హైకోర్టు కీలక తీర్పు

Strong Room

Strong Room

ధర్మపురి స్ట్రాంగ్ రూం తాళం చెవి మిస్సింగ్ కేసులో హైకోర్టు కీలక తీర్పు.. తాళంచెవుల మిస్సింగ్ పై హైకోర్టుకు వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్…స్ట్రాంగ్ రూం తాళాల మిస్సింగ్ పై విచారణ.. తాళాలను పగలగొట్టాలని కోర్టును కోరిన ఈసీ.. 24న సంబంధిత డాక్యూమెంట్లను అందించాలని జిల్లా అధికారులను ఆదేశించిన కోర్టు.. అభ్యర్థులకు నోటీసులు ఇచ్చి వారి సమక్షంలో తాళాలు పగలగొట్టనున్న జిల్లా యంత్రాంగం.. కోర్టు ఆదేశించిన మేరకు 17A, 17C పత్రాలతో పాటు సీసీ పుటేజీని జగిత్యాల జిల్లా అధికారులు అందించనున్నారు.

Also Read : Covid Deaths: కోవిడ్ మరణాలపై ప్రభుత్వం ఏమందంటే?

2018లో జరిగిన ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ అభ్యర్థి అట్లూరి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు. కౌంటింగ్ లో అన్యాయం జరిగిందని పిటిషన్ దాఖలు చేశారు. నాటి ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్.. అట్లూరి లక్ష్మణ్ పై స్వల్ప మెజారిటీ గెలిచారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఈ వివాదం కోర్టు తీర్పు వెలువరించింది. స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన ఎన్నికల కౌంటింగ్ పత్రాలను సమర్పించాలని న్యాయస్థానం ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. ఈ నెల 10న స్ట్రాంగ్ రూమ్ తెరిచేందుకు వెళ్లిన అధికారులకు తాళంచెవులు కనిపించలేదు. దీంతో తాళాలు కనిపించకపోవడంపై లక్ష్మణ్ మరోసారి కోర్టు మెట్లు ఎక్కాడు. ఎన్నికల అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో కీస్ మిస్సింగ్ పై విచారణ చేపట్టాలంటూ ఎన్నికల అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఢిల్లీ అధికారుల టీమ్ జేఎస్టీయూ కాలేజీలో విచారణ చేపట్టింది.

Also Read : Tejasvi Surya: బీజేపీ స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్‌లో లేని తేజస్వి సూర్య

అయితే తాళం చెవి సరిపోక స్ట్రాంగ్ రూం తెరవలేకపోయామని జగిత్యాల జిల్లా కలెక్టర్ న్యాయస్థానానికి తెలిపారు. ఎన్నికల డాక్యుమెంట్లు కావాలంటే స్ట్రాంగ్ రూం తాళం పగలగొట్టడం మినహా ప్రత్యామ్నయం లేదని కోర్టుకు తెలిపారు. స్ట్రాంగ్ రూం తాళాల గల్లంతుపై విచారణ జరుగుతోందని ధర్మసనానికి తెలిపారు. మరోవైపు స్ట్రాంగ్ రూం తాళం చెవులు ఉద్దేశపూర్వకంగానే మాయం చేశారని కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ తరపు న్యాయవాది ఆరోపించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు చివరకు తాళాలు పగలగొట్టేందుకు అనుమతించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.