Site icon NTV Telugu

TS Govt :ఉద్యోగులు, పింఛనర్లకు గుడ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం..

Whatsapp Image 2023 06 23 At 3.12.41 Pm

Whatsapp Image 2023 06 23 At 3.12.41 Pm

తెలంగాణ రాష్ట్రం అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు దశ కు చేరుకున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కు మరియు పింఛనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు, పింఛనర్లకు ఇచ్చే అలవెన్స్‌ను  పెంచుతూ విభాగాల వారీగా ఉత్తర్వులను కూడా జారీ చేసింది.జీవోలో ఈ విధంగా పేర్కొన్నది.ఉద్యోగులకు ట్రావెలింగ్ అండ్ కన్వీనియన్స్ అలవెన్స్ దాదాపు 30శాతం పెంచింది. బదిలీ పై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ను 30శాతం పెంచింది. సెలవు రోజుల్లో పనిచేసే లిఫ్ట్ ఆపరేటర్లు అలాగే డైవర్లకు అదనంగా రూ. 150 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. షెడ్యూల్ ఏరియాలో పనిచేసే ఉద్యోగులకు కూడా స్పెషల్ కాంపన్సెటరీ అలవెన్స్ ను 30శాతం పెంచింది.దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వీయన్స్ అలవెన్స్ రూ. 2000 నుంచి రూ. 3000 కు ప్రభుత్వం పెంచింది. ఇళ్లు నిర్మించుకునే వారికి ఇచ్చే అడ్వాన్స్ మొత్తాన్ని రూ. 20 లక్షల నుంచి రూ. 30లక్షల వరకు పెంచింది. కారు కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ ను రూ. 6లక్షల నుంచి 9 లక్షల వరకు అయితే పెంచింది.

మోటార్ సైకిల్ కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ ను 80వేల నుంచి రూ. లక్ష వరకు పెంచింది ప్రభుత్వం.ఉద్యోగుల పిల్లల పెళ్లి కి సంబంధించి కుమార్తె పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ ను లక్ష నుంచి దాదాపు రూ. 4 లక్షల వరకు అలాగే కుమారుడి పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ రూ. 75వేల నుంచి రూ. 3 లక్షల వరకు ప్రభుత్వం పెంచింది.స్టేట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ ఉద్యోగులకు ఇచ్చే ఇన్సెంటివ్ ను కూడా 30శాతం పెంచింది. అలాగే వివిధ విభాగాల్లో పని చేసే పోలీసుల కు ఇచ్చే స్పెషల్ పేస్‌ను 2020 పే స్కేల్ ప్రకారం వర్తింపచేస్తారని ప్రభుత్వం చెప్పుకొచ్చింది . పింఛనర్లు చనిపోతే ఇచ్చే తక్షణ సాయం రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాల వారీగా ఉత్వర్వులను జారీ చేసింది.

Exit mobile version