TS Govt :ఉద్యోగులు, పింఛనర్లకు గుడ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రం అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు దశ కు చేరుకున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కు మరియు పింఛనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు, పింఛనర్లకు ఇచ్చే అలవెన్స్‌ను పెంచుతూ విభాగాల వారీగా ఉత్తర్వులను కూడా జారీ చేసింది.జీవోలో ఈ విధంగా పేర్కొన్నది.ఉద్యోగులకు ట్రావెలింగ్ అండ్ కన్వీనియన్స్ అలవెన్స్ దాదాపు 30శాతం పెంచింది. బదిలీ పై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ను 30శాతం పెంచింది. సెలవు రోజుల్లో పనిచేసే లిఫ్ట్ ఆపరేటర్లు అలాగే డైవర్లకు అదనంగా రూ. 150 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. షెడ్యూల్ ఏరియాలో పనిచేసే ఉద్యోగులకు కూడా స్పెషల్ కాంపన్సెటరీ అలవెన్స్ ను 30శాతం పెంచింది.దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వీయన్స్ అలవెన్స్ రూ. 2000 నుంచి రూ. 3000 కు ప్రభుత్వం పెంచింది. ఇళ్లు నిర్మించుకునే వారికి ఇచ్చే అడ్వాన్స్ మొత్తాన్ని రూ. 20 లక్షల నుంచి రూ. 30లక్షల వరకు పెంచింది. కారు కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ ను రూ. 6లక్షల నుంచి 9 లక్షల వరకు అయితే పెంచింది.
మోటార్ సైకిల్ కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ ను 80వేల నుంచి రూ. లక్ష వరకు పెంచింది ప్రభుత్వం.ఉద్యోగుల పిల్లల పెళ్లి కి సంబంధించి కుమార్తె పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ ను లక్ష నుంచి దాదాపు రూ. 4 లక్షల వరకు అలాగే కుమారుడి పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ రూ. 75వేల నుంచి రూ. 3 లక్షల వరకు ప్రభుత్వం పెంచింది.స్టేట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ ఉద్యోగులకు ఇచ్చే ఇన్సెంటివ్ ను కూడా 30శాతం పెంచింది. అలాగే వివిధ విభాగాల్లో పని చేసే పోలీసుల కు ఇచ్చే స్పెషల్ పేస్‌ను 2020 పే స్కేల్ ప్రకారం వర్తింపచేస్తారని ప్రభుత్వం చెప్పుకొచ్చింది . పింఛనర్లు చనిపోతే ఇచ్చే తక్షణ సాయం రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాల వారీగా ఉత్వర్వులను జారీ చేసింది.
Also Read
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?