Site icon NTV Telugu

TS Engineering Counselling: ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షురూ..

Engineering Counciling

Engineering Counciling

TS Engineering Counselling: తెలంగాణ‌ రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కాలేజీల ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ సంబంధిచి షెడ్యూల్‌ వచ్చేసింది. ఈ కౌన్సెలింగ్‌ పక్రియ మొత్తం 3 విడతల్లో ప్రవేశాలను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిరన్యం తీసుకుంది. ఈ నేపథ్యంలో జూన్‌ 27 తేదీ నుండి ప్రవేశాలను మొదలు పెట్టాలని ఉత్తర్వులను జారీ చేసింది. ఇక ప్రక్రియలో భాగంగా జూన్‌ 30 తేదీ నుండి మొదటి విడత వెబ్‌ ఆప్షన్లకు ఆవకాశం ఇవ్వనున్నారు. ఇక చివరగా మొదటి విడత సీట్ల కేటాయింపు జూలై 12వ తేదీన జరగనుంది.

Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. రంగంలోకి ఏకంగా 50 ఫైర్‌ ఇంజన్లు..

ఆ తదుపరి జూలై 19వ తేదీ నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ మొదలు కానుంది. రెండో విడతలో జూలై 24 తేదీ సీట్ల కేటాయింపు జరుగును. ఇక చివరి మూడో విడత కౌన్సిలింగ్‌ ను జూలై 30 తేదీ మొదలు పెట్టి.. ఆగస్టు 5 తేదీన సీట్లు కేటాయించబోతున్నట్లు అధికారులు తెలిపారు.

Shocking: బిడ్డ లింగ నిర్ధారణ కోసం భార్య కడుపు చీల్చిన కసాయి భర్త..

ఆ తర్వాత ఆగస్టు 12వ తేదీ నుంచి ఏదైనా ఇంటర్నల్‌ స్లైడింగ్‌ సీట్ల కేటాయింపులను చేపట్టనున్నారు. ఇక చివరగా ఆగస్టు 17 తేదీన స్పాట్‌ ఆడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల కాబోతున్నాయి.

Exit mobile version