Site icon NTV Telugu

TG ECET 2025 : నేడు తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు విడుదల

Tg Ecet 2025

Tg Ecet 2025

TG ECET 2025 : తెలంగాణ రాష్ట్రంలోని కాలేజీల్లో 2025–2026 విద్యా సంవత్సరానికి బీఈ, బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఈసెట్‌ (TS ECET) పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదల కాబోతున్నాయి. ఈ మేరకు ఈసెట్ కన్వీనర్ డాక్టర్ పి. చంద్రశేఖర్ ప్రకటన విడుదల చేశారు. ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో మే 25న మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం. కుమార్ హాజరుకానున్నారు.

Asaduddin Owaisi: పాక్ ఉగ్రవాద దేశం.. ఈసారి దాడి చేస్తే.. నాశనం చేస్తాం!

పరీక్ష ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ హాల్‌టికెట్ వివరాలు నమోదు చేసి ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ర్యాంక్ ఆధారంగా పాలిటెక్నిక్‌, బీఎస్సీ గణితం పూర్తి చేసిన అభ్యర్థులు బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశం పొందగలరు. ఈ సంవత్సరం కూడా ఈ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇక, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) 2024 పోస్టులకు సంబంధించి మే 5న నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన డైరెక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియలో చివరి దశగా సైకోమెట్రిక్ టెస్ట్ మే 31న నిర్వహించనుండగా, ఇంటర్వ్యూలు జూన్ 5 నుంచి 9వ తేదీ వరకు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ బ్రాంచుల్లో 600 పీవో పోస్టుల భర్తీకి ఈ ప్రక్రియను చేపట్టారు.

Instagram Friendship: ఇంస్టాగ్రామ్ పరిచయం.. రెండు ప్రాణాలు బలి..!

Exit mobile version