NTV Telugu Site icon

TS E Challan Discount 2023: వాహనదారులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్ చలాన్లపై మరోసారి భారీ రాయితీ..?

Traffic Pending Challans

Traffic Pending Challans

Traffic Pending Challans: వాహనదారులకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు అదిరిపోయే శుభవార్త చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై మరోసారి భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ రెడీ అవుతుంది. పెండింగ్‌లో ఉన్న చలాన్లను వసూలు చేసేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. గత ఏడాది పెండింగ్ చలాన్లపై రాయితీ ఇవ్వగా.. ఫైన్లు కట్టేందుకు వాహనదారుల నుంచి భారీగా ఎగబడ్డారు. రాయితీ ఉన్న టైంలో దాదాపు 300 కోట్ల రూపాయల వరకు పెండింగ్ చలాన్లు వసూలు అయ్యాయి. మరోసారి ఇలాంటి ఆఫర్ ఇవ్వాలని పోలీస్ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్వర్తులు త్వరలోనే వెలువడే ఛాన్స్ ఉంది.

Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

అయితే, వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే పోలీసులు చలాన్లు వేస్తుంటారు. ఎక్కడ ఎలాంటి తప్పు చేసినా.. ఫొటోలు క్లిక్‌మనిపించి ఆన్‌లైన్‌లో చలాన్లు పంపిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు ఈ-చలాన్లు విధిస్తున్నారు. ఇక, ఈ-చలాన్లు వసూలు చేయడం ట్రాఫిక్ పోలీసులకు భారంగా మారుతోంది. ఎక్కడైనా చెకింగ్ నిర్వహించినప్పుడు వెహికిల్ నెంబర్ ఆధారంగా చలాన్లు పెండింగ్‌లో ఉంటే అప్పుడే ఎక్కువగా వసూలు అవుతున్నాయి. చాలా మంది వాహనదారులు ఆన్‌లైన్‌లో తమ పెండింగ్ చలాన్లు చూసుకున్నా.. దొరికినప్పుడు కట్టుకుందాంలే అనుకునే ధోరణిలో ఉన్నారు.

Read Also: Cold waves: బాబోయ్ తెలంగాణలో చలి చంపేస్తుంది..

ఈ నేపథ్యంలో భారీ రాయితీ ప్రకటిస్తే పెండింగ్ చలాన్లు వసూలు అవుతాయని ట్రాఫిక్ పోలీసులు అనుకుంటున్నారు. గతేడాది మార్చి 31వ తేదీ నాటికి రాష్ట్రంలో మొత్తం 2.4 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉంటే.. వీటిని వసూలు చేసేందుకు భారీ ఆఫర్ ప్రకటించారు. బైక్‌లపై 75 శాతం, మిగిలిన వాటికి 50 శాతం రాయితీ ఇవ్వగా.. దీంతో వాహనదారుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పెండింగ్ చలానాలు చెల్లించేందుకు జనం ఎగబడ్డారు. 45 రోజుల వ్యవధిలోనే దాదాపు రూ.300 కోట్ల పెండింగ్ చలాన్లు వసూలు అయినట్లు పోలీస్ శాఖ తెలిపింది. ప్రస్తుతం మళ్లీ పెండింగ్ చలానాల సంఖ్య భారీగా పెరిగిపోయింది.. దీంతో మరోసారి రాయితీ ప్రకటించేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు.

Show comments