తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. దీనిలో భాగంగా ఐసెట్, ఈసెట్, లాసెట్ వంటి ప్రవేశ పరీక్షలు జరిగే షెడ్యూల్‌ను విడుదల చేసింది. మే 7న ప్రారంభమయ్యే తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ మరియు మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET)తో రాష్ట్ర ప్రభుత్వం 2023 వివిధ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల షెడ్యూల్‌ను విడుదల చేసింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష మే 7 నుంచి 11 వరకు, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష మే 12 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు.
Also Read : Shraddha Walkar Case: శ్రద్ధ హత్య కేసు ఛార్జిషీట్ లో సంచలన విషయాలు.. ఎముకలను పౌడర్ చేసే యత్నం
అదే విధంగా ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎడ్‌సెట్) మే 18న, ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మే 20న నిర్వహిస్తారు. లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్, పీజీ లాసెట్ రెండూ మే 25న జరుగుతాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 26, 27 తేదీల్లో ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, మే 29 నుంచి 31 వరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read : Demand for Hotel Rooms: జర్నీలు పెరగనుండటంతో రూములకు గిరాకీ
