NTV Telugu Site icon

TS Assembly: తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా

Telangana Assembly

Telangana Assembly

TS Assembly: తెలంగాణ శాసన సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సీఎం కేసీఆర్ ప్రసంగం అనంతరం సభను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిరవధికంగా వాయిదా వేశారు. వారం రోజుల పాటు జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగగా.. 56 గంటల 25 నిమిషాల పాటు బడ్జెట్ సమావేశాలు సాగాయి. ఈ సమావేశాల్లో 38 ప్రశ్నలకు సమాధానం లభించింది. ఈ నెల 3న తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు గర్నవర్‌ ప్రసంగంతో మొదలయ్యాయి. ఈ నెల 6న ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సభ చర్చించింది. అలాగే పలు బిల్లు, తీర్మానాలపై చర్చ సాగింది. సమావేశాలు చివరి రోజైన ఆదివారం ఆర్థికమంత్రి హరీశ్‌రావు ద్రవ్య వినియమ బిల్లును ప్రవేశపెట్టారు. అలాగే ప్రశ్నోత్తరాల్లో భాగంగా బస్తీ దవాఖానాలు, గురుకులాలు, హరితవనాలు, పునరుత్పాదక ఇంధన వనరులు, సమీకృత వ్యవసాయ మార్కెట్లు, పంట రుణాల మాఫీ, అక్షరాస్యత తదితర అంశాలపై సమాధానాలు ఇచ్చారు.

Read Also: Cruel Father: మా నాన్న మంచోడు కాదు.. జైల్లో పెట్టండి

ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు సీఎం కేసీఆర్. ప్రధాని మోదీ ప్రభుత్వ పాలనలో ఒక్క రంగంలోనైనా వృద్ధిరేటు ఉందా? అని నిలదీశారు. మన దేశంలో చాలినంత నాణ్యమైన బొగ్గు ఉందని అన్నారు. అయినప్పటికీ, కొందరు పారిశ్రామిక స్నేహితుల కోసం మోదీ రాష్ట్రాల మెడలపై కత్తులు పెట్టి విదేశాల నుంచి బొగ్గు కొనిపిస్తున్నారని అన్నారు. దేశంలో దమ్మున్న ప్రధాని ఉంటే 24 గంటల విద్యుత్ ఎందుకు సాధ్యం కాదని నిలదీశారు. రెండు ప్రపంచ యుద్ధాల సమయంలోనూ జనాభా గణన ఆగలేదని కానీ, ఇప్పుడు మాత్రం ఆపారని కేసీఆర్ విమర్శించారు. జనాభా లెక్కలు జరిగితే బండారం బయట పడుతుందని కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని, జనాభా గణన చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీలు అడుగుతున్నారని చెప్పారు.

Read Also: K.Veeramani: మరోసారి బీసీలు యుద్ధానికి రెడీ కావాలి

Show comments