NTV Telugu Site icon

Indian Nationals Deported: 205 మంది భారతీయుల్ని బహిష్కరించిన ట్రంప్.. టెక్సాస్ నుంచి ఇంటికి….

Deported Indians

Deported Indians

Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్న పనుల్ని చేస్తున్నారు. ముఖ్యంగా అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారిని దేశం నుంచి బహిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. దీని వల్ల అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులు ఇంటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ సహా వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారుల సామూహిక బహిష్కరణ ప్రారంభమైంది. అమెరికాలో సుమారుగా 11 మిలియన్ల మంది డాక్యుమెంట్లు లేని వలసదారులు ఉన్నట్లు అంచనా.

Read Also: White onion, red onion: తెల్ల ఉల్లిపాయ, ఎర్ర ఉల్లిపాయ..ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా !

తాజాగా, యూఎస్ నుంచి 205 మంది భారతీయులను బహిష్కరించారు. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో నుంచి 205 మమది భారతీయలతో కూడిన యూఎస్ మిలిటరీ C-17 విమానం తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరినట్లు తెలుస్తోంది. అమెరికాలోని అక్రమ భారతీయులను తీసుకువచ్చే మొదటి విమానం ఇదే కావచ్చు. ఆ తర్వాత కూడా దశల వారీగా అక్రమ భారతీయులను యూఎస్ నుంచి ఇండియాకు పంపించనున్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కి ఈ విమానం రాబోతోంది. దీనికి ముందు ఇంధనం నింపుకునేందుకు జర్మనీలోని రామ్‌స్టెయిన్‌లో దిగే అవకాశం ఉంది. ప్రస్తుతం యిర్ ఫోర్స్ సి-17లో 205 మందికి కేవలం ఒకే టాయిలెట్ ఉంది. గతంలో గ్వాటెమాల, పెరూ, హోండూరాస్‌ దేశాలకు చెందిన వారిని ఇలాగే విమానాల్లో వారి దేశాలకు తరలించారు.

ఇదిలా ఉంటే, చట్టవిరుద్ధంగా యూఎస్‌లో ఉంటున్న భారతీయలను తీసుకునేందుకు తమ దేశం సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు. అక్రమ భారతీయ వలసదారులను తిరిగి తీసుకునే విషయంలో భారతదేశం “సరైనది చేస్తుంది” అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. ప్రస్తుతం ఉన్న వివరాల ప్రకారం.. 18,000 మంది ఇల్లీగల్‌గా ఉంటున్న భారతీయులను గుర్తించినట్లు సమాచారం.