Site icon NTV Telugu

Trump: మా డిమాండ్లు అంగీకరించకపోతే మోజ్తాబాను చంపేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్!

Trump

Trump

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. అలాగే ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ను ట్రంప్‌ను హెచ్చరించినట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు రాసింది. అమెరికా డిమాండ్లను ఇరాన్ తిరస్కరిస్తే కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబాను చంపేందుకు ట్రంప్ మద్దతు ఇస్తారని ‘‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’’ తన కథనంలో పేర్కొంది. ఈ మేరకు ప్రస్తుత, మాజీ అధికారులు చెప్పినట్లుగా తెలిపింది.

ఇరాన్ తన అణు ఆయుధాల కార్యక్రమాన్ని పూర్తిగా వదిలేయాలని అమెరికా ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్లకు ఇరాన్ అంగీకరించకపోతే కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని ప్రస్తుత, మాజీ అమెరికా అధికారులు వెల్లడించినట్లు కథనంలో వెల్లడించింది. ఖమేనీ తరహాలోనే మోజ్తాబాను కూడా చంపేందుకు ట్రంప్ వెనకాడరని తెలిపింది. అమెరికా వర్గాల ప్రకారం.. అవసరమైతే ఈ ఆపరేషన్‌ను ప్రధానంగా ఇజ్రాయెల్ బలగాలు చేపట్టే అవకాశముందని పేర్కొంది. ఫిబ్రవరి 28న జరిగిన దాడి తరహాలోనే ఈ దాడి జరుగుతుందని సంకేతాలు ఇచ్చింది.

ఇటీవల ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు మోజ్తాబా నియమితులయ్యారు. అయితే ఈ నియామకాన్ని ట్రంప్ తప్పుపట్టారు. పెద్ద తప్పిదం అని వ్యాఖ్యానించారు. అయినా కూడా ఆయన ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగలేరని సందేహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. కొత్త లీడర్ ప్రశాంతంగా జీవించగలడని తనకు అనిపించడం లేదని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: War Effect: చెన్నైలో వదంతులు.. పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కట్టిన వాహనదారులు

గత నెల 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడిలో ఖమేనీ హతమయ్యాడు. అనంతరం పాలనా అనుభవం లేకపోయినా ఖమేనీ కుమారుడైన మోజ్తాబాను కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నారు. అయితే ఖమేనీ వీలునామాలో తన వారసుడిగా కుమారుడిని నియమించొద్దని రాశారని.. దీంతో చాలా మంది మతాధికారులు మోజ్తాబా నియామకాన్ని అడ్డుకున్నారు. అయినా కూడా మోజ్తాబానే నియమితులయ్యారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో సన్నిహిత సంబంధాలు ఉండడంతో మోజ్తాబా నియామకం జరిగిపోయింది.

ఇది కూడా చదవండి: Iran: యుద్ధం ముగింపునకు ఇరాన్ 3 షరతులు.. రెస్పాన్స్ ఎలా ఉంటుందో..!?

Exit mobile version