Site icon NTV Telugu

Donald Trump: ఇజ్రాయెల్‌పై ట్రంప్ ఫైర్.. ఖతార్‌తో జాగ్రత్త అంటూ హెచ్చరిక

Trump Israel Warning

Trump Israel Warning

Donald Trump: ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. హమాస్ నాయకులను నిర్మూలించడానికి ఇజ్రాయెల్ ఎక్కడి వరకైనా వెళ్తుందని స్పష్టంగా చెప్పారు. తమ పోరాటంలో అమెరికా భాగస్వామ్యం ఉంటుందని చెప్పడంతో, ఇప్పుడు దోహాపై దాడి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ దాడిపై ట్రంప్ ఏవిధంగా స్పందించాడో చూద్దాం..

READ ALSO: Waqf Act : వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై సుప్రీం కోర్టు మధ్యంతర తీర్పు

ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ దాడి తర్వాత మొదటిసారి ట్రంప్ దీనిపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఖతార్ అమెరికాకు స్నేహితుడు అని దానిపై దాడి చేసే ముందు బాగా ఆలోచించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును హెచ్చరించారు. గల్ఫ్ దేశంగా, ఖతార్‌తో అమెరికాకు కీలక భాగస్వామ్యం ఉందని ఆయన గుర్తు చేశారు. ఇటువంటి సమయంలో ఇజ్రాయెల్ దానిపై దాడి చేస్తే కీలక పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని, ఇప్పటి నుంచి ఖతార్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

ఖతార్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి..
ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్.. ఖతార్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హమాస్ కోసం ఏదో ఒకటి చేయాలి కానీ, ఖతార్ అమెరికాకు గొప్ప భాగస్వామి అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దని చెప్పారు. ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీని గొప్ప వ్యక్తి అని ఆయన అభివర్ణించారు. ట్రంప్ ఖతార్‌ను అమెరికాకు గొప్ప భాగస్వామి అని పేర్కొవడంతో, నెతన్యాహు ఈ సమస్యను తెలివిగా పరిష్కరించుకోవడానికి ఒక సంకేతంగా విశ్లేషకులు చెబుతున్నారు.

తాజాగా సోమవారం నుంచి ఖతార్ రాజధాని దోహాలో సుమారుగా 50 ముస్లిం దేశాలు సమావేశం కానున్నాయి. ఇజ్రాయెల్ దాడి తర్వాత ఈ సంఖ్యలో ముస్లిం దేశాలు దోహాలో సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఇప్పటికే ఖతార్ ఇజ్రాయెల్ దాడిని తీవ్రంగా ఖండించింది. అలాగే ఇది మధ్యవర్తిత్వం ప్రాథమిక సూత్రంపై దాడి అని పేర్కొంది. ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ థాని ఈ దాడిని ఉగ్రవాద చర్యగా, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా అభివర్ణించారు.

READ ALSO: Medchal : గచ్చిబౌలిలో ప్రహారీ గోడ కూలి ఒకరు మృతి, నలుగురుకి తీవ్ర గాయాలు

Exit mobile version