Donald Trump: ఇజ్రాయెల్‌పై ట్రంప్ ఫైర్.. ఖతార్‌తో జాగ్రత్త అంటూ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. హమాస్ నాయకులను నిర్మూలించడానికి ఇజ్రాయెల్ ఎక్కడి వరకైనా వెళ్తుందని స్పష్టంగా చెప్పారు. తమ పోరాటంలో అమెరికా భాగస్వామ్యం ఉంటుందని చెప్పడంతో, ఇప్పుడు దోహాపై దాడి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ దాడిపై ట్రంప్ ఏవిధంగా స్పందించాడో చూద్దాం..
READ ALSO: Waqf Act : వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై సుప్రీం కోర్టు మధ్యంతర తీర్పు
Also Read
ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ దాడి తర్వాత మొదటిసారి ట్రంప్ దీనిపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఖతార్ అమెరికాకు స్నేహితుడు అని దానిపై దాడి చేసే ముందు బాగా ఆలోచించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును హెచ్చరించారు. గల్ఫ్ దేశంగా, ఖతార్‌తో అమెరికాకు కీలక భాగస్వామ్యం ఉందని ఆయన గుర్తు చేశారు. ఇటువంటి సమయంలో ఇజ్రాయెల్ దానిపై దాడి చేస్తే కీలక పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని, ఇప్పటి నుంచి ఖతార్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
ఖతార్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి..
ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్.. ఖతార్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హమాస్ కోసం ఏదో ఒకటి చేయాలి కానీ, ఖతార్ అమెరికాకు గొప్ప భాగస్వామి అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దని చెప్పారు. ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీని గొప్ప వ్యక్తి అని ఆయన అభివర్ణించారు. ట్రంప్ ఖతార్‌ను అమెరికాకు గొప్ప భాగస్వామి అని పేర్కొవడంతో, నెతన్యాహు ఈ సమస్యను తెలివిగా పరిష్కరించుకోవడానికి ఒక సంకేతంగా విశ్లేషకులు చెబుతున్నారు.
తాజాగా సోమవారం నుంచి ఖతార్ రాజధాని దోహాలో సుమారుగా 50 ముస్లిం దేశాలు సమావేశం కానున్నాయి. ఇజ్రాయెల్ దాడి తర్వాత ఈ సంఖ్యలో ముస్లిం దేశాలు దోహాలో సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఇప్పటికే ఖతార్ ఇజ్రాయెల్ దాడిని తీవ్రంగా ఖండించింది. అలాగే ఇది మధ్యవర్తిత్వం ప్రాథమిక సూత్రంపై దాడి అని పేర్కొంది. ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ థాని ఈ దాడిని ఉగ్రవాద చర్యగా, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా అభివర్ణించారు.
READ ALSO: Medchal : గచ్చిబౌలిలో ప్రహారీ గోడ కూలి ఒకరు మృతి, నలుగురుకి తీవ్ర గాయాలు
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?