Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: హోర్ముజ్ జలసంధి సంక్షోభం సృష్టించిన ఉద్రిక్తతల మధ్య, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఓ సంచలన నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలను మళ్లీ మండించబోతోంది. రష్యా ముడి చమురు కొనుగోళ్లపై గతంలో ఇచ్చిన తాత్కాలిక మినహాయింపును ట్రంప్ పొడగించేందుకు నిరాకరించారు. ఈ మినహాయింపు గడువు శనివారంతో (మే 16) ముగిసిపోయింది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై అమెరికా, ఐరోపా దేశాలు కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ, మార్చి 2026లో ఇరాన్ యుద్ధం మొదలై హోర్ముజ్ జలసంధి దిగ్బంధానికి గురికావడంతో గ్లోబల్ మార్కెట్లో చమురు కొరత ఏర్పడింది. అప్పట్లో మార్కెట్‌ను సమతుల్యం చేయడానికి సముద్రంలోని ట్యాంకర్లపై లోడ్ చేసిన చమురుకు మాత్రమే వర్తించేలా ట్రంప్ ప్రభుత్వం ఒక ప్రత్యేక మినహాయింపునిచ్చింది. అయితే, ఈ చమురు విక్రయాల ద్వారా వచ్చే డబ్బు రష్యా యుద్ధ నిధిని బలోపేతం చేస్తోందని ఐరోపా దేశాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ట్రంప్ ఈ మినహాయింపును రద్దు చేశారు.
ఈ నిర్ణయం ముడి చమురు పెద్ద ఎగుమతిదారు అయిన రష్యాతో పాటు గ్లోబల్ మార్కెట్‌కు, ముఖ్యంగా భారతదేశానికి పెద్ద దెబ్బగా మారింది. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా మార్చి, ఏప్రిల్ 2026 మధ్య కాలంలో భారత్.. యూరప్, రష్యాల నుంచి చమురు దిగుమతులను భారీగా పెంచింది. మార్చి 2026లో భారత్ ప్రతిరోజూ దాదాపు 4.5 మిలియన్ బారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకోగా, అందులో దాదాపు 50 శాతం వాటా రష్యాదే కావడం విశేషం. అదే సమయంలో మిడిల్ ఈస్ట్ నుంచి సరఫరా 61 శాతం వరకు పడిపోయింది. ఏప్రిల్ 2026లో కూడా రష్యానే భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా నిలిచింది. ఫిబ్రవరితో పోలిస్తే ఏప్రిల్‌లో భారత ముడి చమురు దిగుమతులు 85 శాతం స్థాయిలో ఉన్నాయి. అయితే ఏప్రిల్‌లో రష్యా నుంచి ముడి చమురు దిగుమతి ప్రతిరోజూ దాదాపు 1.57 మిలియన్ బారెళ్లుగా నమోదైంది. ఇది మార్చి నెలతో పోలిస్తే 20 శాతం తక్కువ కావడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఇటీవలనే భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 3 రూపాయల చొప్పున పెంచడంతో పాటు సీఎన్జీ ధరలను సైతం పెంచారు. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో అంతర్జాతీయంగా చమురు ధరలు గనుక ఇలాగే అదుపులేకుండా పెరిగితే, భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి ఆకాశాన్నంటుతాయని, తద్వారా తీవ్రమైన ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!