Trump-Pakistan: పాకిస్థాన్‌కు ఊహించని సిట్యుయేషన్.. ట్రంప్ ప్రతిపాదనకు ‘నో’ చెప్పిన పాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump-Pakistan: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం నాడు పాకిస్థాన్‌ను ఒక పెద్ద సంకట స్థితిలోకి నెట్టారు. ఇరాన్‌తో అధికారిక శాంతి ఒప్పందం కుదరాలంటూ, దానికి లంకె పెడుతూ… అబ్రహం ఒప్పందంలో (Abraham Accords) భాగస్వామి కావాలని, అలాగే ఇజ్రాయెల్‌ను అధికారికంగా గుర్తించాలని పాకిస్థాన్‌ను ట్రంప్ డిమాండ్ చేశారు. దీంతోపాకిస్థాన్కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి (Catch-22 situation) ఎదురైంది. ఒకవేళ ట్రంప్ మాటను కాదంటే ముప్పు కొనితెచ్చుకున్నట్లవుతుంది. అలాగని ఒప్పుకుంటే తమ బద్ధశత్రువైన ఇజ్రాయెల్‌ను గుర్తించాల్సి వస్తుంది. అయితే పాకిస్థాన్ మొదటి మార్గాన్నే ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. తమ “ప్రాథమిక సిద్ధాంతాల” విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు.
పాకిస్థాన్‌కు ఇది చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన సమస్యగా మారింది. తన 78 ఏళ్ల చరిత్రలో పాకిస్థాన్ ఎప్పుడూ ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా గుర్తించనే లేదు. అసలు ఇజ్రాయెల్ దేశం పట్ల పాకిస్థాన్‌కు ఉన్న సుదీర్ఘమైన, కఠినమైన విధానం కారణంగా తాము అబ్రహం ఒప్పందంలో చేరే అవకాశమే లేదని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. సమా టీవీ (Samaa TV)కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… తమ ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉండే ఇలాంటి ఎలాంటి ఒప్పందాలలోనూ తాము చేరబోమని, కనీసం ఒక్క రోజు సైతం నమ్మడానికి వీల్లేని వ్యక్తులతో కలిసి తాము చర్చలకు ఎలా కూర్చోగలమని ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ పట్ల తమ ఆలోచనా విధానంలో ఎలాంటి మార్పు లేదని చెప్పడానికి ఖవాజా ఆసిఫ్ తమ దేశ పాస్‌పోర్ట్ విధానాన్ని కూడా ఉదాహరణగా చూపెట్టారు. ప్రపంచంలోనే తమ పాస్‌పోర్ట్‌లపై ఇజ్రాయెల్ పేరును సైతం చేర్చని ఏకైక దేశం పాకిస్థాన్ మాత్రమేనని, తమ పౌరులు ఎవరూ పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌పై ఇజ్రాయెల్‌కు వెళ్లే వీల్లేదని గుర్తుచేశారు. ఈ విషయంలో తమ స్టాండ్ చాలా స్పష్టంగా ఉందని, ట్రంప్ ప్రతిపాదన తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తోసిపుచ్చారు.
Also Read
- Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇంత ఘాటుగా స్పందించడానికి కారణం… ట్రంప్ విసిరిన దౌత్యపరమైన సవాళ్లే. సోమవారం డొనాల్డ్ ట్రంప్ తన ముక్కుసూటి, ఊహించని శైలిలో మాట్లాడుతూ… పలు ముస్లిం మెజారిటీ, అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చుకోవాలని, దీనిని “తప్పనిసరి అభ్యర్థనగా” భావించాలని కోరారు. అంతేకాదు, ఇరాన్ వివాదానికి ముగింపు పలకాలంటే ఈ దేశాలు ఇజ్రాయెల్‌తో చేతులు కలపాల్సిందేనని లింక్ పెట్టారు. దీంతో 2020లో జరిగిన ‘అబ్రహం ఒప్పందాలు’ మళ్లీ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. అసలు ఈ అబ్రహం ఒప్పందాలు అంటే… ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పేందుకు 2020లో అమెరికా మధ్యవర్తిత్వం వహించి కుదిర్చిన ఒక ప్రత్యేకమైన ద్వైపాక్షిక ఒప్పందాల సిరీస్. ఇప్పుడు అదే ఒప్పందాన్ని అడ్డం పెట్టుకుని ట్రంప్ పాకిస్థాన్‌పై ఒత్తిడి తెస్తుండటంతో గ్లోబల్ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి.
తాజావార్తలు
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?