Site icon NTV Telugu

US Pakistan Relations: ట్రంప్ అకస్మాత్తుగా పాకిస్థాన్ ప్రేమలో ఎందుకు పడ్డారు..? భారత మాజీ దౌత్యవేత్తల వివరణ..

Us

Us

US Pakistan Relations: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌లను వైట్ హౌస్‌లో కలిశారు. ఓవల్ కార్యాలయంలో షాబాజ్, మునీర్‌లను కలవడానికి ముందు.. ట్రంప్ వారిద్దరినీ ప్రశంసించారు. మునీర్‌ను కొంచెం ఎక్కువగానే మెచ్చుకున్నారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌తో ట్రంప్‌ సమావేశం కావడం ఇది రెండవ సారి. ట్రంప్ గతంలో జూన్ 18, 2025న మునీర్‌ను కలిశారు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. కాగా.. పాకిస్థాన్‌పై ట్రంప్ యు-టర్న్ తీసుకోవడంపై విస్తృతంగా చర్చలు జరిగాయి.

READ MORE: YS Sharmila: మెడలో ఉల్లిపాయల మాల వేసుకున్న షర్మిళ.. అడ్డుకున్న పోలీసులు!

తాజాగా ఈ అంశంపై అనేక దేశాలకు రాయబారిగా పనిచేసిన భారత మాజీ దౌత్యవేత్త అజయ్ బిసారియా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో వివరించారు. పాకిస్థాన్, కెనడా, పోలాండ్, లిథువేనియాలలో భారత హైకమిషనర్‌గా పనిచేసిన అజయ్ బిసారియా మాట్లాడుతూ.. ట్రంప్ తన మొదటి పదవీకాలంలో పాకిస్థాన్ పై మోసం ఆరోపణలు చేశారు. అప్పట్లో తాము పాకిస్థాన్ కు $33 బిలియన్లు ఇచ్చామని, అయితే.. పాకిస్థాన్ అబద్ధం చెప్పి మనల్ని మోసం చేసిందని ట్రంప్ ఆరోపించారు. కానీ ఇప్పుడు అదే ట్రంప్ మునీర్ ను అద్భుతమైన వ్యక్తి అని పిలుస్తున్నారు. ఎందుకంటే.. మునీర్ ట్రంప్‌ను నోబెల్ బహుమతికి నామినేట్ చేశాడు. ఇది మూనీర్ ని మొచ్చుకోవడానికి ప్రధాన కారణమన్నారు.

READ MORE: Pak PM: భారత్‌తో కాల్పుల విరమణకు ట్రంప్ సాయం: ప్రధాని షెహబాజ్ షరీఫ్..

ప్రస్తుతం పాకిస్తాన్ విదేశాంగ విధానం అమెరికా, చైనా, సౌదీ అరేబియా చుట్టూ తిరుగుతుందని మాజీ దౌత్యవేత్త అజయ్ బిసారియా తెలిపారు. చైనా, సౌదీ అరేబియా లాగా అమెరికాను తన గుప్పిట్లోకి తీసుకురావడంలో పాక్ విజయం సాధించిందన్నారు. అమెరికా పాకిస్థాన్‌కు భారీ పెట్టుబడి ప్యాకేజీని కూడా అందించిందని తెలిపారు. మునీర్ ట్రంప్‌ను నోబెల్ బహుమతికి నామినేట్ చేయడంతో ట్రంప్ మురిసిపోయి.. పాకిస్థాన్ కు ఆఫర్ లు ఇస్తున్నారని తెలిపారు. అయితే, చైనా, అమెరికాలను కలిసి ఉచ్చులో వేసుకునేందుకు పాకిస్థాన్ పన్నిన కుట్ర త్వరలోనే బెడిసి కొడుతుందని.. ఎక్కువ కాలం పనిచేయదని అజయ్ బిసారియా అభిప్రాయపడ్డారు. చైనా పాకిస్థాన్ కు ప్రధాన మిత్రుడు. ఈ విషయం ఆపరేష్ సిందూర్ సమయంలో స్పష్టంగా అర్థమైంది. కానీ.. అమెరికా చైనాలా కాదు. పాకిస్థాన్ మాత్రం అమెరికా, చైనా ప్రయోజనాలను ఎక్కువ కాలం సమతుల్యం చేసుకోలేదన్నారు.

READ MORE: Pak PM: భారత్‌తో కాల్పుల విరమణకు ట్రంప్ సాయం: ప్రధాని షెహబాజ్ షరీఫ్..

అమెరికా, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న సంబంధాల గురించి మొనాకోలోని ఫ్రాన్స్‌కు భారత రాయబారిగా పని చేసిన జావేద్ అష్రఫ్ మాట్లాడుతూ.. షాబాజ్-మునీర్ ఇప్పుడు చేస్తున్నది కొత్త కాదు. పాకిస్థాన్ దశాబ్దాలుగా అమెరికాను తన వలలో వేసుకుంటోంది. ఈ రెండు దేశాలే ప్రపంచంలో ఇస్లామిక్ ఛాందసవాదానికి మూలాలు. పాకిస్థాన్ ప్రస్తుతం ట్రంప్‌ను ఉచ్చులో పడేసినట్లే, బుష్, ఒబామా పరిపాలనలోనూ అదే జరిగింది. మరోవైపు.. అమెరికా పాకిస్థాన్‌ను చైనా నుంచి దూరం చేయాలని కోరుకుటుంటోంది.” అని ఆయన అన్నారు.

Exit mobile version