US Pakistan Relations: ట్రంప్ అకస్మాత్తుగా పాకిస్థాన్ ప్రేమలో ఎందుకు పడ్డారు..? భారత మాజీ దౌత్యవేత్తల వివరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Pakistan Relations: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌లను వైట్ హౌస్‌లో కలిశారు. ఓవల్ కార్యాలయంలో షాబాజ్, మునీర్‌లను కలవడానికి ముందు.. ట్రంప్ వారిద్దరినీ ప్రశంసించారు. మునీర్‌ను కొంచెం ఎక్కువగానే మెచ్చుకున్నారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌తో ట్రంప్ సమావేశం కావడం ఇది రెండవ సారి. ట్రంప్ గతంలో జూన్ 18, 2025న మునీర్‌ను కలిశారు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. కాగా.. పాకిస్థాన్‌పై ట్రంప్ యు-టర్న్ తీసుకోవడంపై విస్తృతంగా చర్చలు జరిగాయి.
READ MORE: YS Sharmila: మెడలో ఉల్లిపాయల మాల వేసుకున్న షర్మిళ.. అడ్డుకున్న పోలీసులు!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
తాజాగా ఈ అంశంపై అనేక దేశాలకు రాయబారిగా పనిచేసిన భారత మాజీ దౌత్యవేత్త అజయ్ బిసారియా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో వివరించారు. పాకిస్థాన్, కెనడా, పోలాండ్, లిథువేనియాలలో భారత హైకమిషనర్‌గా పనిచేసిన అజయ్ బిసారియా మాట్లాడుతూ.. ట్రంప్ తన మొదటి పదవీకాలంలో పాకిస్థాన్ పై మోసం ఆరోపణలు చేశారు. అప్పట్లో తాము పాకిస్థాన్ కు $33 బిలియన్లు ఇచ్చామని, అయితే.. పాకిస్థాన్ అబద్ధం చెప్పి మనల్ని మోసం చేసిందని ట్రంప్ ఆరోపించారు. కానీ ఇప్పుడు అదే ట్రంప్ మునీర్ ను అద్భుతమైన వ్యక్తి అని పిలుస్తున్నారు. ఎందుకంటే.. మునీర్ ట్రంప్‌ను నోబెల్ బహుమతికి నామినేట్ చేశాడు. ఇది మూనీర్ ని మొచ్చుకోవడానికి ప్రధాన కారణమన్నారు.
READ MORE: Pak PM: భారత్‌తో కాల్పుల విరమణకు ట్రంప్ సాయం: ప్రధాని షెహబాజ్ షరీఫ్..
ప్రస్తుతం పాకిస్తాన్ విదేశాంగ విధానం అమెరికా, చైనా, సౌదీ అరేబియా చుట్టూ తిరుగుతుందని మాజీ దౌత్యవేత్త అజయ్ బిసారియా తెలిపారు. చైనా, సౌదీ అరేబియా లాగా అమెరికాను తన గుప్పిట్లోకి తీసుకురావడంలో పాక్ విజయం సాధించిందన్నారు. అమెరికా పాకిస్థాన్‌కు భారీ పెట్టుబడి ప్యాకేజీని కూడా అందించిందని తెలిపారు. మునీర్ ట్రంప్‌ను నోబెల్ బహుమతికి నామినేట్ చేయడంతో ట్రంప్ మురిసిపోయి.. పాకిస్థాన్ కు ఆఫర్ లు ఇస్తున్నారని తెలిపారు. అయితే, చైనా, అమెరికాలను కలిసి ఉచ్చులో వేసుకునేందుకు పాకిస్థాన్ పన్నిన కుట్ర త్వరలోనే బెడిసి కొడుతుందని.. ఎక్కువ కాలం పనిచేయదని అజయ్ బిసారియా అభిప్రాయపడ్డారు. చైనా పాకిస్థాన్ కు ప్రధాన మిత్రుడు. ఈ విషయం ఆపరేష్ సిందూర్ సమయంలో స్పష్టంగా అర్థమైంది. కానీ.. అమెరికా చైనాలా కాదు. పాకిస్థాన్ మాత్రం అమెరికా, చైనా ప్రయోజనాలను ఎక్కువ కాలం సమతుల్యం చేసుకోలేదన్నారు.
READ MORE: Pak PM: భారత్‌తో కాల్పుల విరమణకు ట్రంప్ సాయం: ప్రధాని షెహబాజ్ షరీఫ్..
అమెరికా, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న సంబంధాల గురించి మొనాకోలోని ఫ్రాన్స్‌కు భారత రాయబారిగా పని చేసిన జావేద్ అష్రఫ్ మాట్లాడుతూ.. షాబాజ్-మునీర్ ఇప్పుడు చేస్తున్నది కొత్త కాదు. పాకిస్థాన్ దశాబ్దాలుగా అమెరికాను తన వలలో వేసుకుంటోంది. ఈ రెండు దేశాలే ప్రపంచంలో ఇస్లామిక్ ఛాందసవాదానికి మూలాలు. పాకిస్థాన్ ప్రస్తుతం ట్రంప్‌ను ఉచ్చులో పడేసినట్లే, బుష్, ఒబామా పరిపాలనలోనూ అదే జరిగింది. మరోవైపు.. అమెరికా పాకిస్థాన్‌ను చైనా నుంచి దూరం చేయాలని కోరుకుటుంటోంది.” అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!