Trump: అగ్రరాజ్యాధినేత యుద్ధ విమరణకు కారణం ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump: ప్రపంచాన్ని యుద్ధ భయంతో వణికించిన అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్, కేవలం ఎనిమిది గంటల వ్యవధిలోనే తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నారు. “బలప్రయోగం ద్వారానే శాంతి” అని ప్రగల్భాలు పలికిన ట్రంప్, ఇప్పుడు “శాంతి కోసం బలాన్ని ఉపయోగించను” అంటూ ప్రకటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు చేయబోమని, వారం రోజుల పాటు చర్చలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. అయితే, ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: CM Chandrababu : ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. EHS బిల్లుల చెల్లింపు ఇక ఆన్‌లైన్‌లో
Also Read
- కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
- Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
1. విఫలమైన ‘మొస్సాద్’ వ్యూహం..
యుద్ధం ప్రారంభంలో ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ ‘మొస్సాద్’ ఒక అంచనాతో అమెరికాను ముందుకు నడిపింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, అధ్యక్షుడు అలీ లారిజానీలను హతమార్చితే, అక్కడి ప్రజలు తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూల్చేస్తారని భావించారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. దేశాధినేతలను కోల్పోయినా ఇరాన్ ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా ఒక్కటయ్యారే తప్ప, అంతర్గత తిరుగుబాటుకు దిగలేదు. దీంతో మొస్సాద్ వ్యూహం పూర్తిగా విఫలమైందని ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది.
2. గల్ఫ్ దేశాల గట్టి హెచ్చరిక
సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్ వంటి గల్ఫ్ దేశాల నుంచి ట్రంప్‌కు తీవ్ర ఒత్తిడి ఎదురైంది. ఈ యుద్ధం వల్ల ఇజ్రాయెల్ లాభపడుతుంటే, తాము నష్టపోతున్నామని ఆ దేశాలు వాదించాయి. ఒకవేళ అమెరికా ఇరాన్ చమురు కేంద్రాలపై దాడి చేస్తే, ప్రతిగా ఇరాన్ తమ దేశాల్లోని (కువైట్, సౌదీ, బహ్రెయిన్) ఇంధన వనరులపై దాడులు చేస్తుందని అవి భయపడ్డాయి. తమ భూభాగం నుంచి అమెరికా దాడులు చేయడాన్ని ఖతార్ వంటి దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
3. హోర్ముజ్ జలసంధి చిక్కుముడి
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని అదుపులోకి తీసుకోవడం అమెరికాకు సాధ్యం కాలేదు. అది చాలా ఇరుకైన మార్గం కావడంతో, అక్కడ అమెరికా యుద్ధనౌకలను పంపడం ప్రమాదకరమని జాతీయ భద్రతా సలహాదారు డాన్ కేన్ ట్రంప్‌ను హెచ్చరించారు. ఇరాన్ యొక్క చిన్న చిన్న పడవలు కూడా భారీ యుద్ధనౌకలను దెబ్బతీయగలవని, అక్కడ నౌకలు మునిగితే ఆ మార్గం శాశ్వతంగా మూతపడి ప్రపంచవ్యాప్త ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని వివరించారు.
4. ఒంటరిగా మిగిలిన అమెరికా
నాటో (NATO) దేశాలు – ఐరోపా దేశాల మద్దతును ట్రంప్ ఆశించినప్పటికీ, ఇరాన్ విషయంలో ఏ దేశం కూడా అమెరికాకు నేరుగా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. సైనిక పరంగా, దౌత్యపరంగా ఒంటరిగా పోరాడటం అమెరికాకు ఆర్థికంగా, రాజకీయంగా పెను భారమని గ్రహించిన ట్రంప్ వెనక్కి తగ్గక తప్పలేదు.
ఇరాన్ విజయోత్సాహం..
ట్రంప్ ప్రకటనను ఇరాన్ తన విజయంగా అభివర్ణించింది. తమ క్షిపణులు, హోర్ముజ్ జలసంధి వ్యూహం అగ్రరాజ్యాన్ని మోకరిల్లేలా చేశాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. 24 రోజుల యుద్ధం తర్వాత అమెరికా చర్చలకు మొగ్గు చూపడం ఇరాన్‌కు దౌత్యపరంగా పెద్ద విజయంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
READ ALSO: Koratala Siva: అయ్యో ‘దేవర’.. టాప్ డైరెక్టర్‌కు దొరకని హీరోలు.. నిజమేనా?
తాజావార్తలు
-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగుండదు, లాభాలే లాభాలు!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!