Site icon NTV Telugu

Trump: ట్రంప్ ప్రకటనతో మారిన చమురు లెక్కలు.. రూ.5,440 కోట్ల భారీ బెట్టింగ్ వెనుక అసలేం జరిగింది?

Trump

Trump

Trump: తన నిర్ణయాలతో ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు సృష్టి్స్తున్న వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. తాజాగా ఆయన ఇరాన్ విషయంలో తీసుకున్న ఒక నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. ఇరాన్ ఇంధన కేంద్రాలపై జరగాల్సిన సైనిక దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడమే దీనికి కారణం. అయితే, ఈ ప్రకటన వెలువడటానికి సరిగ్గా 15 నిమిషాల ముందే సుమారు 580 మిలియన్ డాలర్ల (సుమారు రూ.5,440 కోట్లు) భారీ వ్యాపారం జరగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ విషయాలు ఏంటో ఆ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: 10th Result: టెన్త్ ఫలితాల్లో అదరగొట్టిన బాలిక.. 600కు గాను 594 మార్కులు

ఆ 15 నిమిషాల ‘మిస్టరీ’ ..
ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ట్రూత్ సోషల్’లో ఇరాన్‌తో చర్చలు సఫలమయ్యాయని పోస్ట్ చేయడానికి కేవలం 15 నిమిషాల ముందే చమురు మార్కెట్లో భారీ బెట్టింగ్ జరిగింది. న్యూయార్క్ సమయం ప్రకారం ఉదయం 6:49 నుంచి 6:50 గంటల మధ్య, అంటే కేవలం ఒక్క నిమిషంలోనే బ్రెంట్ క్రూడ్, డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్ ధరలు తగ్గుతాయని అంచనా వేస్తూ ఇన్వెస్టర్లు సుమారు 6,200 కాంట్రాక్టులపై పందెం కాశారు. ట్రంప్ ప్రకటన రాగానే అంచనా వేసినట్లే చమురు ధరలు భారీగా పడిపోయాయి. దీంతో ఆ 15 నిమిషాల ముందు ట్రేడింగ్ చేసిన వారు భారీ లాభాలను ఆర్జించారు. ట్రంప్ తన పోస్ట్‌లో.. “అమెరికా, ఇరాన్ మధ్య గత రెండు రోజులుగా అర్థవంతమైన చర్చలు జరిగాయి. ఇరాన్ ఇంధన వ్యవస్థలపై జరగాల్సిన సైనిక దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నాం” అని పేర్కొన్నారు. ఈ వార్తతో ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలుతున్న షేర్ మార్కెట్లు ఒక్కసారిగా కోలుకున్నాయి. అయితే, ఇరాన్ మాత్రం ఈ వార్తలను పూర్తిగా కొట్టిపారేసింది. అమెరికాతో నేరుగా కానీ, మధ్యవర్తుల ద్వారా కానీ ఎలాంటి చర్చలు జరగలేదని ఇరాన్ వార్తా సంస్థ ‘ఫార్స్’ స్పష్టం చేసింది. ఇది ఆర్థిక, చమురు మార్కెట్లను ప్రభావితం చేయడానికి సృష్టించిన ‘ఫేక్ న్యూస్’ అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగేర్ గాలిబాఫ్ ఆరోపించారు.

ఎలాంటి ఆర్థిక గణాంకాలు లేదా ముందస్తు సంకేతాలు లేని సమయంలో, ఇంత భారీ స్థాయిలో ట్రేడింగ్ జరగడం అత్యంత అసాధారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ ప్రకటన వెలువడక ముందే ఈ సమాచారం ఎవరికైనా తెలిసిందా? అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించనప్పటికీ, ఈ వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది.

READ ALSO: Deva Katta: పవర్ స్టార్‌తో సినిమా.. దేవాకట్టా రియాక్షన్ ఇదే!

Exit mobile version