Trump: వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో దీపాలు వెలిగించి దీపావళి జరుపుకొన్నారు. భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ.. భారతీయులంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. భారత ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడాను. ఇద్దరం అద్భుతమైన సంభాషణ జరిపాం. వాణిజ్యం, అనేక విషయాలను చర్చించాం. ముఖ్యంగా వ్యాపార ప్రపంచం గురించి చర్చించుకున్నాం. ప్రపంచ వాణిజ్యంపై మోడీకి చాలా ఆసక్తి ఉంది. పాకిస్థాన్‌తో ఘర్షణలు వద్దనే విషయంపై మేము కొంతకాలం క్రితం మాట్లాడాం. వాణిజ్యం ద్వారానే అది సాధ్యమైందనుకుంటున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు.
READ MORE: Karthika Masam: నేడు కార్తీక మాసం ప్రారంభం.. గోదావరి నదికి పోటెత్తిన భక్తులు..
అయితే.. ఈ సందర్భంగా ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గంతలో చాలా సార్లు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు నిలిపేస్తుందని ప్రకటించిన ట్రంప్ తాజాగా స్వరం మార్చారు. రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనబోదని వ్యాఖ్యానించారు. గంతలో పూర్తిగా కొనుగోళ్లు నిలిపేయాలని వారించిన ట్రంప్.. తాజాగా కొంత మేరకు మాత్రమే కొనుగోలు చేయాలనే అర్థం వచ్చేలా మాట్లాడటం ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు.. ట్రంప్ తాజా వాదనలను భారతదేశం ధృవీకరించలేదు. వారం క్రితం, ట్రంప్ ఇలాంటి వాదననే చేస్తూ.. తాను ప్రధాన మంత్రి మోడీతో మాట్లాడానని, రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేస్తామని మోడీ హామీ ఇచ్చారని అన్నారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మాస్కోను ఒంటరిగా చేసే ప్రయత్నాలలో ట్రంప్ దీనిని ప్రధాన అడుగుగా అభివర్ణించారు. కానీ ఆ సమయంలో భారత్ ఈ ప్రకటనను పూర్తిగా ఖండించింది. ఇద్దరు నాయకుల మధ్య ఎటువంటి ఫోన్ సంభాషణ జరగలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) స్పష్టం చేసింది.
READ MORE: Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు భారీగా నామినేషన్లు..