Americans Oppose Trump: అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ నిత్యం తన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన ఎందుకు వార్తల్లో నిలిచారు అంటే.. మనోడి తీరు అమెరికన్లకు కూడా నచ్చడం లేదంటా. ఇది నిజం అండీ బాబు అమెరికన్లు తమ అధ్యక్షుడిని ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారని తాజాగా నిర్వహించిన సర్వేలో వెలుగుచూసింది. 242 రోజుల పాలన తర్వాత ట్రంప్ రేటింగ్ -17 శాతానికి పడిపోయింది. ఇంతకీ అమెరికా అధ్యక్షుడిని వాళ్ల జనాలే వ్యతిరేకించడానికి కారణాలు ఏంటో ఇక్కడ చూద్దాం..
READ ALSO: YS Jagan: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు.. రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్దాం..
రేటింగ్ తగ్గడానికి అనేక కారణాలు..
పలువురు విశ్లేషకుల అభిప్రాయంలో.. ట్రంప్ రేటింగ్ తగ్గుదలకు అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. వాటిలో ఆయన తీసుకున్న సుంకాల విధానాలు, విదేశాంగ విధానం, కఠినమైన వలస విధానాలు, ప్రభుత్వ ఉద్యోగాలకు భారీ కోతలు, విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకోవడం వంటివి తాజాగా నిర్వహించిన సర్వేలో ఆయన రేటింగ్ పడిపోడానికి కారణం అయ్యాయని చెబుతున్నారు. ది ఎకనామిస్ట్ నివేదిక ప్రకారం.. ట్రంప్ ప్రజాదరణ గత వారంతో పోలిస్తే 2.6 పాయింట్లు తగ్గింది. తాజా డేటా ప్రకారం.. ట్రంప్ పని శైలిని 39% మంది మాత్రమే ఆమోదిస్తున్నారు. 56% మంది ఆయన పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారని పేర్కొంది. మరో 4% మందికి ట్రంప్ పనితీరు గురించి స్పష్టమైన అభిప్రాయం లేదని తెలిపింది. గత వారం సెప్టెంబర్ 5-9 మధ్య నిర్వహించిన రాయిటర్స్ ఇప్సోస్ సర్వే బుధవారం విడుదల చేసిన నివేదికలో ట్రంప్ ఆమోదం రేటింగ్ -14 గా చూపించింది. 42% మంది ట్రంప్ పనితీరును ఆమోదించగా, 56% మంది ఆయన పని తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
అమెరికాలో ట్రంప్ విధానాలపై ఆగ్రహం..
తొమ్మిది నెలలుగా సాగుతున్న ట్రంప్ పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. వాణిజ్య ఒప్పందాలు, వలస విధానం, శ్రామిక శక్తి, విదేశాంగ విధానంలో ప్రధాన మార్పులను అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దీనితో పాటు ట్రంప్ తన ప్రసంగాల్లో న్యాయశాఖ, అమెరికన్ విశ్వవిద్యాలయాలు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, మీడియా తదితర సంస్థలపై కూడా దాడి చేశారు. ట్రంప్ విధానాలు, దూకుడు శైలిపై అమెరికన్ ప్రజలలో ఆగ్రహం పెరుగుతోందని ఈ నివేదికలు తెలియజేస్తున్నాయి.
సుంకాల ఉచ్చులో అమెరికాలో..
ఈ ఏడాది ప్రారంభంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రంప్ సుంకాల ప్రచారాన్ని ప్రారంభించారు. అమెరికన్ వ్యాపారాలను పెంచాల్సిన అవసరాన్ని పేర్కొంటూ ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలపై సుంకాలు విధించే ప్రణాళికలను ప్రకటించారు. అమెరికా భారతదేశానికి అతి పెద్ద వాణిజ్య భాగస్వామి అయినప్పటికీ, ట్రంప్ భారత వస్తువులపై 25% సుంకం విధించారు. ఆ తర్వాత రష్యా చమురు కొనుగోలు చేసినందుకు శిక్షగా ఇండియాపై అదనంగా 25% సుంకం విధించారు. ఆగస్టు 27 నుంచి భారతదేశంపై 50% సుంకం అమల్లోకి వచ్చింది. ఇది భారతదేశ వస్త్ర, ఆభరణాల పరిశ్రమలకు హాని కలిగించడమే కాకుండా, అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని కూడా పెంచింది. ఈ సుంకాలు భారతీయ ఉత్పత్తులను అమెరికాలో ఖరీదైనవిగా చేశాయి. ఇది అమెరికన్లలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ట్రంప్ సుంకాలు భారత్-అమెరికా సంబంధాలను దెబ్బతీశాయి. అమెరికాలో కూడా ఆయన విదేశాంగ విధానంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. గత అమెరికా అధ్యక్షులు భారత్-అమెరికా సంబంధాలను మెరుగుపరచడానికి చాలా కష్టపడ్డారని, కానీ ట్రంప్ ఆ ప్రయత్నాలన్నింటినీ రద్దు చేశారని పలుువురు అమెరికా నిపుణులు విమర్శిస్తున్నారు.
READ ALSO: Berlin Bomb Scare: పాపం ఎప్పుడు పోయేవాళ్లో.. జర్మనీలో 80 ఏళ్లుగా పేలని బాంబు
