Site icon NTV Telugu

Trump: ‘అమెరికా భవిష్యత్తు చైనా నాసిరకం ఉక్కుపై ఆధారపడి ఉండదు’.. ఉక్కు దిగుమతులపై 50% సుంకం

Trump

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం విదేశీ ఉక్కు దిగుమతులపై సుంకాలను రెట్టింపు చేసే ప్రణాళికను ప్రకటించారు. ప్రస్తుత 25 శాతం నుంచి సుంకం రేటును 50 శాతానికి పెంచారు. అమెరికన్ ఉక్కు పరిశ్రమను ప్రోత్సహించడమే ఈ సుంకం లక్ష్యం అని ఆయన అన్నారు. పెన్సిల్వేనియాలోని యుఎస్ స్టీల్, మోన్ వ్యాలీ వర్క్స్-ఇర్విన్ ప్లాంట్‌లో మాట్లాడుతూ, సుంకాల పెంపు దేశీయ ఉక్కు ఉత్పత్తిదారులను రక్షించి, అమెరికన్ తయారీని పెంచుతుందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.

Also Read:Operation Shield: పాకిస్తాన్ సరిహద్దులోని రాష్ట్రాల్లో నేడు మాక్ డ్రిల్.. వణుకుతున్న పాక్

ట్రంప్ మాట్లాడుతూ.. ‘మేము ఉక్కు దిగుమతులపై సుంకాన్ని 25% పెంచబోతున్నాం. అమెరికాలో ఉక్కుపై సుంకాన్ని 25% నుంచి 50%కి తగ్గించబోతున్నాం, ఇది మన దేశంలో ఉక్కు పరిశ్రమను మరింత సురక్షితంగా చేస్తుంది.’ చైనాను లక్ష్యంగా చేసుకుని, అమెరికా భవిష్యత్తును ‘షాంఘై నుంచి చౌకైన ఉక్కు’పై ఆధారపడకుండా ‘పిట్స్‌బర్గ్ బలం, గర్వంతో’ నిర్మించాలని ట్రంప్ తెలిపారు.

Also Read:Off The Record: వాలంటీర్‌ వ్యవస్థను వైసీపీ లైట్‌ తీసుకోబోతోందా..?

ప్రతిపాదిత సుంకాల పెంపు అమలు చేయబడితే, గృహనిర్మాణం, ఆటోమోటివ్, నిర్మాణ రంగాలతో సహా ఉక్కుపై ఎక్కువగా ఆధారపడిన పరిశ్రమలకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. బలమైన వాణిజ్య రక్షణ కోసం ట్రంప్ నిరంతరం పిలుపునిస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2018లో అమెరికాలో ఉక్కుపై సుంకాలు మొదటిసారి విధించినప్పటి నుంచి ఉక్కు ఉత్పత్తుల ధరలు దాదాపు 16 శాతం పెరిగాయి. జపాన్‌కు చెందిన నిప్పాన్ స్టీల్‌తో కూడిన ప్రతిపాదిత పెట్టుబడి ఒప్పందం ప్రకారం యుఎస్ స్టీల్ అమెరికన్ కంపెనీగానే ఉంటుందని ట్రంప్ అన్నారు.

Exit mobile version