Shafali-Deepthi: భారత మహిళల క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 ఫైనల్‌లో భారత్ చారిత్రక విజయాన్ని అందుకుని.. తమ తొలి ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. నవి ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయానికి ఇద్దరు యువ క్రీడాకారిణులు షఫాలీ వర్మ, దీప్తి శర్మల ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కీలకంగా నిలిచారు.
Chevella: చేవెళ్లలో బస్సు ప్రమాదం.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తీవ్ర దిగ్భ్రాంతి
నిజానికి షఫాలీ వర్మ ODI ప్రపంచకప్ జట్టులో మొదట లేదు. ఏడాది క్రితం ఆమె స్థానంలో జట్టులోకి వచ్చిన ప్రతికా రావల్ లీగ్ మ్యాచ్‌లో గాయపడటంతో.. విధి నిర్ణయం మేరకు ఆమె తిరిగి జట్టులోకి, అదీ నాకౌట్ దశలో ఎంట్రీ ఇచ్చింది. సెమీఫైనల్లో పెద్దగా రాణించకపోయినా ఫైనల్లో మాత్రం ఆమె తన ప్రతిభను చాటుకుంది. ఫైనల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఆమె కేవలం 78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో కలిపి 87 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను 298 పరుగుల భారీ స్కోరుకు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. ఇక షఫాలీ ప్రదర్శన బ్యాటింగ్‌తోనే ఆగలేదు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఆశ్చర్యకరంగా ఆమెకు బౌలింగ్ బాధ్యత అప్పగించగా షఫాలీ బంతితో కూడా మ్యాజిక్ చేసింది. తన తొలి ఓవర్‌లోని రెండో బంతికే దక్షిణాఫ్రికా కీలక క్రీడాకారిణి సునే లూస్ వికెట్‌ను తీసింది. ఆ తర్వాత మరో ముఖ్యమైన ప్లేయర్ మారిజాన్ కాప్‌ను కూడా ఎల్‌బీడబ్ల్యూ ట్రాప్ చేసి పెవిలియన్‌కు పంపింది. షఫాలీ బౌలింగ్ లో మొత్తంగా 7 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు తీసి ఆఫ్రికా మిడిల్ ఆర్డర్‌ను దెబ్బకొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన షఫాలీకి ‘ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్’ అవార్డు దక్కింది.
Rohit Sharma: తాను సాధించలేకపోయినా.. మహిళల గెలుపుతో కన్నీరు పెట్టుకున్న హిట్ మ్యాన్..!
మరోవైపు భారత అనుభవజ్ఞులలో ఒకరైన దీప్తి శర్మ తన ఆల్‌రౌండ్ ప్రతిభను మరోసారి అద్భుతంగా చూపించింది. ఆమె బ్యాటింగ్‌లో 58 బంతుల్లో 58 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడింది. ఆ తర్వాత బౌలింగ్‌లో తన స్పిన్ మ్యాజిక్‌తో 9.3 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి ఏకంగా 5 వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ టోర్నమెంట్‌లో దీప్తి మొత్తంగా 215 పరుగులతో పాటు 21 వికెట్లు తీసి సత్తా చాటడంతో ఆమెకు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ గౌరవం దక్కింది. ఇక మొత్తంగా భారత్ తరఫున ప్రతీ మ్యాచ్‌లో కొత్త హీరోలు వెలుగులోకి రాగా ఫైనల్లో షఫాలీ, దీప్తి శర్మల ఆల్‌రౌండ్ ప్రతిభ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత నాయకత్వంలో జట్టు సమిష్టిగా రాణించి చరిత్ర సృష్టించింది. ఈ విజయం భారత మహిళల క్రికెట్‌కు ఒక నూతన యుగాన్ని అందించింది.
