అధికార టీఆర్ఎస్ పార్టీలో నేతల మధ్య పోటీ తీవ్రంగానే వుంటుంది. అందులోనూ ఖమ్మం జిల్లాలో అయితే ఎప్పుడూ నేత హాట్ కామెంట్లే వేడిని రాజేస్తుంటాయి, సొంత పార్టీ నేతలపైనే బహిరంగ వేదికలపై బాహాటంగా మాట్లాడేస్తుంటారు. సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ యాక్టివ్ గా వుంటారు రేగా కాంతారావు. తాజాగా ఇక 20 సంవత్సరాలు మనమే టీఆర్ఎస్ లో వుండేది.. ప్రజలకు అభివృద్ధి చేసే నాయకుడు కావాలా.. షాడో MLAలు కావాలా తేల్చుకోండి.. తమ్ముళ్ళు ఆవేశపడకండి.. 2023లో మన గెలుపుతో పర్యాటకులు అడ్రెస్ ఉండరు.. గెలిసిందల్లా న్యాయం కాకపోవచ్చు కానీ చివరకు గెలిచేది న్యాయమే అంటూ కామెంట్లు చేశారు. వీటితో పాటు ఎన్ని వ్యయప్రయాసలు పడ్డా చివరకు గెలిచేది మనమే తమ్ముళ్ళు.. డోంట్ వర్రీ అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.
Read Also: Telangana Assembly: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
నాలాంటి వాడు ఉంటే వాళ్ల ఆటలు సాగవనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలపైనే విప్ మండిపడుతుంటారు. రెండునెలల క్రితం రేగా కాంతారావు చేసిన కామెంట్లు మరిచిపోకముందే.. తాజాగా సోషల్ మీడియాలో ఈ గులాబీనేత గులాబీ బ్యాక్ గ్రౌండ్ లో చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. నా పదేళ్ల వయసులోనే నేను కత్తులతో ఆడుకున్నానని.. స్వతహాగా నేను ఫైటర్‌ని, నాకు కత్తి తిప్పడం వచ్చు…
నాకు తుపాకీ పేల్చడం కూడా వచ్చు అంటూ చేసిన కామెంట్లు గతంలో భద్రాద్రిలో చర్చగా మారాయి. అయితే, రాజకీయాలు అంటే ఇవి కావు అని హితవు పలికారు కాంతారావు.. వాళ్ల దుకాణం బందు అవుతుందనే భయంతోనే నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. యాభై కార్లలో వచ్చి వెళ్లేవారితో ఏమైనా ప్రయోజనం ఉందా..? అంటూ నిలదీశారు.. నన్ను గిరిజన వ్యక్తిగా ముద్ర వేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అందరి వాడినని చెప్పుకున్నారు. తాజాగా చేసిన కామెంట్లపై ఆయన ప్రత్యర్థులు ఎలా స్పందిస్తారోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.
Read Also: Rega Kantha rao: నేను ఫైటర్‌ని, కత్తి తిప్పడం, తుపాకీ పేల్చడం కూడా వచ్చు..!
