Site icon NTV Telugu

Triumph Tracker 400: పోలా.. అదిరిపోలా.. ఫ్లాట్-ట్రాక్ స్టైల్‌లో ట్రయంఫ్ ట్రాకర్ 400.. ధర తెలిస్తే దడే..

Triumph Tracker 400

Triumph Tracker 400

ఫ్లాట్-ట్రాక్ స్టైల్‌లో కొత్త ఆధునిక క్లాసిక్ ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ తన 400సీసీ లైనప్‌ను మరింత విస్తరిస్తోంది. తాజాగా యూకే, ఇతర మార్కెట్లలో ట్రయంఫ్ ట్రాకర్ 400ను అధికారికంగా ఆవిష్కరించింది. ఇది ఫ్లాట్-ట్రాక్ రేసింగ్ స్టైల్‌లో రూపొందించిన బైక్, రెట్రో లుక్‌తో ఆధునిక ఫీచర్లు కలిగి ఉంది. ఇది స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400X మాదిరిగానే TR-సిరీస్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంది, కానీ మరింత స్పోర్టీ, అగ్రెసివ్ డిజైన్‌తో వచ్చింది. కంపెనీ 2026 లో UK లో ఈ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనున్నారు. ఈ మోటార్‌సైకిల్ యునైటెడ్ స్టేట్స్‌లో డర్ట్ ట్రాక్ రేసింగ్ కోసం సాధారణంగా ఉపయోగించే ఫ్లాట్-ట్రాక్ రేసింగ్ మోటార్‌సైకిళ్ల నుంచి ప్రేరణ పొందింది.

Also Read:NTR Fan Raju: ఎన్టీఆర్ వీరాభిమాని ‘ఎన్టీఆర్ రాజు’ ఇకలేరు!

ఈ మోటార్‌సైకిల్‌ను 398cc, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో అమర్చారు. ఈ ఇంజిన్ 42 హార్స్‌పవర్, 37.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరు-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు. ట్రయంఫ్ ఈ మోటార్ సైకిల్ పై 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, LED లైట్లు, ఒక చిన్న వైజర్, USD ఫోర్కులు, మోనో-షాక్ సస్పెన్షన్, డ్యూయల్-ఛానల్ ABS, ట్విన్-క్యాప్ అప్స్వెప్ట్ ఎగ్జాస్ట్, రౌండ్ రియర్ వ్యూ మిర్రర్లు వంటి అనేక అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. ఈ మోటార్ సైకిల్ కోసం UK లో బుకింగ్‌లు ఓపెన్ అయ్యాయి. భారతదేశంలో ఈ మోటార్ సైకిల్ లాంచ్ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి వివరాలను ప్రకటించలేదు. ధర రూ. 2.50 లక్షలు – రూ. 2.70 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Exit mobile version