Site icon NTV Telugu

Trisha Leg Injury : కాలికి గాయమైనా తగ్గేదేలే అంటున్న త్రిష

Trisha (1)

Trisha (1)

Trisha Leg Injury : రెండు దశాబ్ధాలుగా తన అందం నటనతో ప్రేక్షకుల మదిని దోచుకుంటున్నారు త్రిష. వర్షం సినిమాతో సక్సెస్ బాట పట్టిన ఆమె.. కెరీర్లో వెనకకు చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కొన్నాళ్లు కామ్ గా ఉన్నా.. తాజాగా పొన్నియన్ సెల్వన్ లో నటించి హిట్ కొట్టారు. ఇప్పుడు సక్సెస్తో మళ్లీ అమ్మడు జోరు పెంచారు. త్రిషకు వరుసగా ఆపర్లు క్యూ కట్టాయి. ఆమె వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లింది. అయితే టూర్‌లో సరదాగా గడుపుతున్న త్రిష ఒక్కసారిగా కింద పడటంతో కాలు విరిగింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ.. టూర్ సగం అయిపోయిందని త్రిష పేర్కొంది. త్రిష కాలికి గాయం కావడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్రిష త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు పోస్ట్ చేస్తున్నారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియన్ సెల్వన్ 1’ తెలుగులో ఆడలేదు కానీ తమిళంలో మాత్రం అతిపెద్ద హిట్ గా నిలిచింది. అనేక సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమాలో త్రిష చాలా అందంగా కనిపించింది. తనతో నటించిన ఐశ్చర్యరాయ్ కి అందంలో పోటీనిచ్చింది. ఆ సినిమా విజయంతో త్రిషకి మళ్ళీ క్రేజ్ పెరుగుతోంది. ఆమె 40కి చేరువలో ఉంది. కానీ మణిరత్నం మాత్రం ఆమెని 30 ఏళ్ల యువతి లెవల్లో ప్రెజెంట్ చేశారు. దీంతో ఆమె లుక్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

Exit mobile version