Trisha Completes Identity Movie Shooting: పరిశ్రమకి వచ్చి రెండు దశాబ్దాలైనా.. ఇప్పటికీ తన అందం, అభినయంతో మెప్పిస్తున్న హీరోయిన్ ‘త్రిష కృష్ణన్’. ఆ మధ్య కాస్త వెనకబడిన త్రిష.. ‘పొన్నియన్ సెల్వన్’తో రేసులోకి వచ్చారు. ప్రస్తుతం అగ్ర హీరోల సరసన నటిస్తూ.. బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈ చెన్నై చిన్నదాని చేతిలో విశ్వంభర’, ‘థగ్ లైఫ్’ ‘విదాముయార్చి’ తదితర చిత్రాలు ఉన్నాయి. ఇంత బిజీలో కూడా ఆమె ఓ మలయాళ చిత్రంను పూర్తి చేశారు.
త్రిష, టోవినో థామస్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఐడెంటిటీ’. అఖిల్ పాల్, అనాస్‌ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సెంచరీ ఫిలింస్, రాగం మూవీస్ బ్యానర్స్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలో త్రిష తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలిపింది. ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోల్ని షేర్ చేసి.. ‘ఐడెంటిటీలో త్రిష పాత్రకు సంబందించిన చిత్రీకరణ పూర్తయింది. ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా ఆమె మా ప్రాజెక్టులో భాగమయినందుకు చాలా సంతోషంగా ఉంది. మా మీద నమ్మకం ఉంచి మాకు సహకరించినందుకు ధన్యవాదాలు’ అని పేర్కొంది.
Also Read: Kalki 2898 AD: డబ్బింగ్ పూర్తి.. సినిమాలకు దీపికా పదుకొనే గ్యాప్!
ఐడెంటిటీలో త్రిష షూటింగ్ పూర్తయినా.. డబ్బింగ్ వర్క్ మాత్రం మిగిలి ఉంది. ఇది తర్వాతి షెడ్యూల్‌లో పూర్తవుతుంది. ఈ సినిమాలో వినయ్ రాయ్, మందిరా బేడి, షమ్మీ తిలకన్, అజు వర్గీస్, అర్జున్ రాధాకృష్ణన్, అర్చన కవితో సహా మరికొందరు నటిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఐడెంటిటీ విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.