NTV Telugu Site icon

Tripura Peace Accord: 30 ఏళ్ల సాయుధ పోరాటానికి తెర!.. త్రిపురలో ‘శాంతి ఒప్పందం’పై ఆమోదం

Tripura

Tripura

భారత ప్రభుత్వం, త్రిపుర ప్రభుత్వం, నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (NLFT), ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ (ATTF) ప్రతినిధులు బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో త్రిపుర శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం తర్వాత.. తాము ప్రభుత్వాన్ని విశ్వసించామని ఎన్ఎల్ఎఫ్‌‌టీ (NLFT) తెలిపింది. అందుకే 30 ఏళ్ల సాయుధ పోరాటానికి ముగింపు పలుకుతున్నామని స్పష్టం చేసింది. తమ నిబంధనలను పంచుకున్నామంది. హోంమంత్రిపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొంది.

READ MORE: Ram Charan: వరద బాధితులకు రామ్ చరణ్ భూరి విరాళం

త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా
ఈ శాంతి ఒప్పందానికి సహకరించిన హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ శాంతి ఒప్పందానికి హోంమంత్రి రూపశిల్పి అని నిరూపించుకున్నారని అన్నారు. గత 10 ఏళ్లలో ఈశాన్య ప్రాంతంలో డజనుకు పైగా శాంతి ఒప్పందాలు జరిగాయని, అందులో 3 ఒప్పందాలు త్రిపురకు సంబంధించినవేనని చెప్పారు. త్రిపుర భవిష్యత్తు ఉజ్వలంగా ఉండనుందని ఆశాభావం వ్యక్తం చేారు. ప్రధాని మోడీకి కూడా కృతజ్ఞతలు తెలిపారు.

READ MORE:Fact Check: ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో ‘పోర్న్ లెటర్’.. స్పందించిన ప్రభుత్వం

అమిత్ షా మాట్లాడుతూ..
ఈ ఒప్పందంతో ఈ రెండు సంస్థలకు చెందిన 328 మంది ప్రధాన స్రవంతిలోకి వస్తారని అమిత్ షా చెప్పారు . త్రిపురలోని ఈ ప్రాంతానికి రూ.250 కోట్ల ప్యాకేజీ ఉంటుందన్నారు. ఈ ఒప్పందంలోని ప్రతిదీ అనుసరించబడుతుందని స్పష్టం చేశారు. దాదాపు 30 ఏళ్లకు పైగా సాగిన పోరాటానికి నేడు తెరపడటం మనందరికీ గర్వకారణమన్నారు. శాంతి, చర్చల ద్వారానే ఇదంతా సాధ్యమైందన్నారు. ప్రధాని మోడీ ఈశాన్య రాష్ట్రాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించారని గుర్తు చేశారు. ఈ ఒప్పందం కాగితం ముక్క కాదని, హృదయాల కలయిక అని అమిత్ షా అన్నారు. ఇప్పుడు మీ హక్కుల కోసం మీరు పోరాడాల్సిన అవసరం లేదని త్రిపురలోని వాటాదారులందరికీ నేను హామీ ఇస్తున్నానని షా అన్నారు. మీ హక్కులను పరిరక్షించడానికి ఒక యంత్రాంగాన్ని రూపొందించడంలో భారత ప్రభుత్వం రెండు అడుగులు ముందుంటుందని స్పష్టం చేశారు.

READ MORE:Stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

ఈ ఏడాది మార్చి నెలలో త్రిపురలోని ఆదివాసీల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో త్రైపాక్షిక ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. టీఐపీఆర్ఏ మోతా, త్రిపుర, కేంద్ర ప్రభుత్వం మధ్య సంతకం చేశారు. అధికారిక ప్రకటన ప్రకారం.. త్రిపుర అసలు నివాసితుల చరిత్ర, భూమి, రాజకీయ హక్కులు, ఆర్థికాభివృద్ధి, గుర్తింపు, సంస్కృతి, భాషకు సంబంధించిన అన్ని సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి అంగీకరించబడింది.

READ MORE:Rahul Dravid : మళ్లీ ప్రధాన కోచ్ బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రవిడ్!

కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే..
ఉగ్రవాదం, హింస, ఘర్షణలు లేని అభివృద్ధి చెందిన ఈశాన్య రాష్ట్రంగా ప్రధాని మోడీ ఆశయాన్ని సాకారం చేసేందుకు హోం మంత్రిత్వ శాఖ అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. పీఎం నాయకత్వంలో, ఈశాన్య ప్రాంతంలో శాంతి మరియు శ్రేయస్సును పునరుద్ధరించడానికి ప్రభుత్వం 12 ముఖ్యమైన ఒప్పందాలపై సంతకం చేసింది. వాటిలో 3 త్రిపుర రాష్ట్రానికి సంబంధించినవి. మోడీ ప్రభుత్వం చేసుకున్న పలు ఒప్పందాల వల్ల సుమారు 10 వేల మంది ఆయుధాలు వదులుకుని సమాజ స్రవంతిలో చేరారని ఆ ప్రకటన పేర్కొంది.