NTV Telugu Site icon

Bad Newz OTT: ఓటీటీలోకి వచ్చేసిన త్రిప్తి దిమ్రీ బోల్డ్ మూవీ ‘బ్యాడ్‌ న్యూజ్‌’!

Bad Newz Ott

Bad Newz Ott

Triptii Dimri’s Bad Newz on Amazon Prime Video: బాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన క్రేజీ సినిమా ‘బ్యాడ్ న్యూజ్’. బోల్డ్ కంటెంట్‌తో రూపొందిన ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కింది. ఫుల్ రన్‌లో ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ‘యనిమల్’ ఫేమ్‌ త్రిప్తి దిమ్రీ నటించడం కూడా సినిమాకు బాగా హెల్ప్ అయింది. థియేటర్‌లో ప్రేక్షకులకు నవ్వులు పంచిన బ్యాడ్ న్యూజ్.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో బ్యాడ్ న్యూజ్ స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన (రూ.349) అందుబాటులో ఉంది. థియేటర్‌లో భారీ హిట్ కొట్టిన ఈ చిత్రం.. ఓటీటీలో కూడా దుమ్ములేపడం ఖాయం. ఈ సినిమా కోసం ముఖ్యంగా యూత్ ఎదురుచూస్తున్నారు. విడుదలకు ముందే అంచనాలు ఏర్పడడంతో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థల మధ్య భారీ పోటీ నెలకొంది. చివరకు అమెజాన్ ప్రైమ్‌ ఈ మూవీ హక్కులను తీసుకుంది. స్ట్రీమింగ్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్‌ భారీ మొత్తాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: Balakrishna-Bobby: సంక్రాంతికి కాదు.. ఆ సెంటిమెంట్‌ రోజే సినిమా విడుదల!

ఆనంద్ తివారి దర్శకత్వంలో వచ్చిన బ్యాడ్ న్యూజ్ చిత్రంలో విక్కి కౌశల్, త్రిప్తి డిమ్రి, అమీ విర్క్ ప్రధాన పాత్రలు చేశారు. ఇందులో నేహా ధూపియా, కరణ్ అజ్లా, తరుణ్ దడేజాలు కూడా నటించారు. జీవితంలో ఎంతో సాధించాలని కలలు కనే అమ్మాయి అనుకోకుండా పెళ్లి చేసుకోవడం, మరొకరితో ఎఫైర్ పెట్టుకోవడం, చివరికి వాళ్లిద్దరి కారణంగా తల్లి అవడం అనే కాన్సెప్టుతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇద్ద‌రు తండ్రులు ఈ సంఘ‌ట‌న‌ని ఎలా స్వీక‌రించారు?, త‌మ బిడ్డ‌ల కోసం ఏం చేశారు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Show comments